నేటి నుంచి ఆర్థిక మంత్రి  బడ్జెట్‌ సమీక్షలు

అమరావతిః నేటి నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ సమీక్షలు నిర్వహించనున్నారు.బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఆయా శాఖ మంత్రులు,ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రెండు రోజులు పాటు జరిగే కీలక సమీక్షల్లో ఏ శాఖకు ఎంత బడ్జెట్‌ కావాలో మంత్రులు, అధికారుల నుంచి  ప్రతిపాదనలు తీసుకోనున్నారు.బడ్జెట్‌లో నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో నవతర్నాలు అమలు,మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేటాయింపుపై సమీక్ష జరుగనుంది. 

Back to Top