రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రోజుకో ఎత్తుగడ  

మంత్రి బొత్స సత్యనారాయణ

టెక్కలి: రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. పేదల ఆకలి తీరకుండా ప్రతిపక్ష నేత కుట్రలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మెదడు లేదని ఎద్దేవా చేశారు. వ్యక్తులు, వ్యవస్థలను నాశనం చేసే అచ్చెన్నాయుడు వంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top