మార్కాపురంలో ర‌క్త‌దాన శిబిరం 

ఘనంగా సీఎం వైయ‌స్ జగన్ పుట్టిన రోజు వేడుకలు..  

ప్ర‌కాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైయ‌స్‌ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నేత సీఎం వైయ‌స్ జగన్ పుట్టిన రోజు వేడుకలను వైయ‌స్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. మార్కాపురంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సీఎం వైయ‌స్‌ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కేక్ కట్ చేశారు. సీఎం వైయ‌స్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకోని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైయ‌స్‌ జగన్‌పై ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారు అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

Back to Top