బీఆర్ నాయుడు భాష బజారు రౌడీల కంటే హీనం

గతంలో ఏ టీటీడీ ఛైర్మన్ ఇంతలా దిగజారి మాట్లాడలేదు  

బీఆర్ నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి.

టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు భాష అత్యంత నీచం..

స్వామివారి ప్రధమ సేవకుడిగా గతంలో ఎవరూ ఇలా దిగజారలేదు..

తప్పులు ఎత్తి చూపితే... నోటికి పనిచెబుతున్నారు..

దేవదేవుడి ప్రతిష్టను దిగజార్చుతున్నారు..

బీ ఆర్ నాయుడుపై నిప్పులు చెరిగిన భూమన కరుణాకర్ రెడ్డి

నా మీద ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించండి..

తప్పు జరిగిందని నిరూపిస్తే శిక్షకు  సిద్ధం..

సవాల్ విసిరిన భూమన..

నా పైనా, మా పార్టీ అధ్యక్షుడిపైనా దుష్ప్రచారం..

క్యూలైన్లో అన్నప్రసాదం, దళిత గోవిందం, స్వామి వారి భక్తి ఛానెల్

ఇవన్నీ నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినవే..

స్పష్టం చేసిన భూమన..

ఒక సాధారణ చప్రాసీ ఉద్యోగి వేల కోట్లు ఎలా సంపాదించారు ?

బట్టతల మీద జత్తు మెలిపించా ? మోకాళ్ల నొప్పికి మందులమ్నా ? 

టీటీడీ చైర్మన్ గా చేసిన మంచి పని ఏదన్నా ఉందా?

క్యూలైన్లో తొక్కిసలాట, కొండ మీద బెల్టు షాపు

దర్శనం కోసం భక్తులు పరుగులు

ఇవన్నీ మీ తప్పిదాలే, ఎత్తిచూపితే ఉలికిపాటు

టీటీడీ చైర్మన్ ని నిలదీసిన భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి: కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరస్వామి స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పాలక మండలి తప్పులను ఎత్తిచూపితే దాన్ని సరిదిద్దుకోకుండా తిరిగి అత్యంత నీచమైన బజారు భాష వాడిన  టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు పై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ చరిత్రలో ఇంత నీచమైన భాష వాడిన వారు మరొక్కరు లేరని మండిపడ్డారు. తన హయాంలో తప్పులు జరిగాయన్న బీ ఆర్ నాయుడి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దమని భూమన ప్రకటించారు. బీ ఆర్ నాయుడు ఎంత నోటికి పని చెప్పినా... చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

స్వామి వారి ప్రధమ సేవకుడిది రౌడీ భాష
  
టీడీపీ పాలకమండలి అధ్యక్షులు బీ ఆర్ నాయుడు హైదరాబాద్ పత్రికా సమావేశంలో తన గొప్పలతో పాటు మా మీద వ్యక్తిగత మైన దూషణలకు దిగి అత్యంత దారుణంగా సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు. ఆయన తనను తాను పొగుడుకోవడమనేది తన కాళ్లను తనే పట్టుకుని తనను తాను దీర్ఘసుమంగళీభవ, దీర్షాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్లుంది. ఇతరులు తనను దీవించాలి కానీ, తనకు తానే దీవించుకున్నారు. ఇవాళ బీ ఆర్ నాయుడు గారు భగవంతుని ప్రసాదం కాకుండా ఇంకేదో తీసుకుని మాట్లాడినట్లు ఉంది. చరిత్రలో ఇంతవరకు ఏ టీటీడీ అధ్యక్షుడు ఇంతలా దిగజారి మాట్లాడిన సందర్భం లేదు. ఆయన వాడిన భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా, నూరుకోట్ల మంది హిందువులు గౌరవించే సంస్ధకు అతి ముఖ్యుడిగా ఉన్న  వ్యక్తి మాట్లాడ్డానికి భిన్నంగా.. నా స్దాయి ఇది, నేను రోడ్డు సైడు వ్యక్తినే అన్నట్టు ఆయన మాట్లాడారు. నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణారెడ్డి ఒక రాస్కెల్, ఒక డెకాయిట్, ఒక నీచుడు, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను అలాంటిలాంటి వాడిని కాదు అంటూ రౌడీల వాడిన భాషను స్వామివారి ప్రధమ భక్తుడిగా ఆయన మాట్లాడారు. 

తప్పులు ఎత్తి చూపితే నోటికి పని...
గతంలో నేను గోవులకు సంబంధించిన తప్పదాన్ని ఎత్తిచూపినప్పుడు ఆయన దాన్ని సమర్ధించుకోవడానికి అసలు కరుణాకర్ రెడ్డి అసలు మనిషే కాదు.  మనుషులకే పుట్టలేదు,మనిషి జన్మకు అనర్హుడని అభ్యంతరకమైన మాటలు మాట్లాడారు. ఆ రోజు కూడా నేను ఆయన్ను దూషించలేదు. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాజకీయప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, తెలుగువాళ్లకు ఆరాధ్యనీయుడైన జగన్మోహన్ రెడ్డి మీద శ్రీమతి భారతీ రెడ్డి మీద కూడా చాలా దూషణ పర్వాలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ  ఛైర్మన్ గా మాట్లాడారా ? లేక బజారు రౌడీగా మాట్లాడారా ? నాకు అర్దం కావడం లేదు. బహుశా ఆయన రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇదే అని ప్రసంగించారేమో? ఎందుకంటే టీటీడీ చైర్మన్ అయితే అలాంటి భాష మాట్లాడే అవకాశం లేదు. ఆయన తన ప్రసంగంలో చాలా రకాల మాటలు, నా మీద అనేక ఆరోపణలు చేశారు. 
బీ ఆర్ నాయుడుగారూ మీరు గతంలోనా నా మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు నా మీద చేస్తున్న ఆరోపణలు మీద సీబీఐ చేత విచారణ వేయించండి, ఆ ఆరోపణలు నిజమైతే నాకు శిక్ష వేయించండి. అలా కాకుండా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని కాసేపు, ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని మరోసారి మాట్లాడుతున్నావు. నా అంతటి వాడు లేడు, నీ అంతు చూస్తానని చెబుతున్నారు. మీలాంటి భరితెగించిన వాడితో యుద్దం చేయడం అంటే నాక్కూడా ఇష్టం. మీరు నా అంతటి వారు లేడని చెబుతున్నారు, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తానని చెబుతున్నారు కాబట్టి మీతోనే పెట్టుకుంటాను. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపితేనే ఉంటాను. మీరు మా పార్టీ అధినాయకుడ్ని, ఆయన సతీమణి గురించి ఇంతలా దుర్భాషలాడిన తర్వాత మీ గురించి, మీ తప్పిదాల గురించి మాట్లాడకుండా ఉంటే నేను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తనే కాను. నేను పోరాటాల్లో, ఉద్యమాల్లో పుట్టి పెరిగిన వాడిని. మీకంటే నాకు ఆ దమ్ము చాలా ఎక్కువగా ఉంది. మీరు చేసే కుహనా విమర్శలు చూసి నేను భయపడిపోను. మీరు ఒక ఛానెల్ కి అధిపతి, వేల కోట్ల రూపాయిలున్నాయని భయపడతాను అనుకుంటే అది మీ తప్పిదం తప్ప మరొక్కటి కాదు. నా తప్పిదాలుంటే విచారణ చేయించు. జైలుకు పోతానని చెబుతున్నావు. అధికార, అహంకారంతో నాలా ప్రశ్నించే వారిని జైల్లో పెట్టడం చాలా సాధారణ విషయం. కనుక మీరు నన్ను కూడా జైల్లో పెట్టండనే కోరుతున్నాను. 
నేను ఏ రోజూ టీటీడీపై ఒక్క స్క్రోలింగ్ ఇవ్వలేదను అని చెప్పారు. మీ ఛానెల్ లో నా హయాంలో టీటీడీపై మీరు 35కు పైగా చేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. అవి మీకు పంపిస్తాను. మీ అంతటి భక్తుడు లేనట్టు, మేం క్రిస్టియన్స్ అని మీ నోటికొచ్చినట్లు అశుద్దపు మాటలు మాట్లాడి.. శ్రీవెంకటేశ్వర క్షేత్రం మహిమను,గొప్పదనాన్ని దిగజార్చే ప్రయత్నం చేయకండి. 

కోట్ల ఆస్తులెలా వచ్చాయో అందరికీ తెలుసు..
బీహెచ్ ఈ ఎల్ లో ఒక సాధారణ చప్రాసీ ఉద్యోగం చేసిన నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో హైదరాబాద్ లో ఉన్న అందరికీ తెలుసు. మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని న్యూజెన్ అనే మందు, మోకాళ్లకు హైజెన్ అనే మందు మీరే కనిపెట్టినట్లు మార్కెట్ లో వదిలి కోట్ల రూపాయలు సంపాదించారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మీరు నాకు తెలుసు. నా మోకాళ్ల నొప్పికి మీ హైజెన్ మందు రుద్దితే నా మోకాళ్లు మరింత అరిగాయే తప్ప నొప్పి తగ్గలేదు. బట్టతల మీద జుత్తు మొలిపిస్తామన్న మీ ప్రచారంతో ఒక్కరి బట్టతల మీద జుత్తు మెులవలేదు. ఇన్ని ఆరోపణలున్న మీరు నా మీద ఆరోపణలు చేస్తున్నారు.

 నా హయాంలో భక్తుల కోసం...
క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆన్నప్రసాదాల కార్యక్రమం నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ప్రవేశపెట్టాను. నేను నాస్తికుడని, క్రైస్తవుడని చెబుతున్నారు.నా హయాంలోనే  శ్రీవెంకటేశ్వస్వామి భక్తి ఛానెల్ తీసుకురావాలన్న ఆలోచన నాది. శ్రీవారి కళ్యాణాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారంటే ఆ ఆలోచన కూడా నాదే. స్వామి వారు ధనవంతుడికి, పేదవాడికి, అగ్రవర్ణాల వారు, దళితులు అందరికీ సమానంగా ఆయనపై భక్తి ఉంటుందని కాబట్టి... దళితులకు స్వామి వారిని దూరం చేయకూడదని దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని కూడా నేనే ప్రవేశపెట్టాను. ఇది క్రైస్తవ ప్రచారమా నాయుడుగారు? 
అలాగే సాధారణ కుటుంబీలకు భగవంతుని పాదాలచెంత ఉంచి, పూజలు  చేయించిన మంగళసూత్రాలను 36 వేల కళ్యాణాలు జరిపించింది నా హయాంలోనే, రాజశేఖరరెడ్డి గారి పుణ్యం వల్లనే చేశాం. ఇది కూడా క్రైస్తవ ప్రచారమా?
అన్నమయ్య 600 జయంతి ఉత్సవం, 103 అడుగులు విగ్రహ ప్రతిష్ఠాపన ఇలా హైందవ ధర్మ పరిరక్షణ కోసం, ధర్మ ప్రచార పరిషత్ గా ఉన్న దాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ గా నా హయాంలోనే మార్చాను. దీన్ని కూడా నాస్తికత్వం అంటారా?  ఇవాళ మీరు వాడిన పదప్రయోగం చూస్తుంటే మీరు కచ్చితంగా నాస్తికుడైనా అయ్యుంటారు లేదా ? భగవంతుడి మీద ఏ మాత్రం విశ్వాసం లేని వారు అయ్యుంటారు. 

తప్పిదాలను సరిదిద్దుకొండి

మీ మీద సద్విమర్శలు చేస్తే.. తట్టుకోలేక ప్రతీఘాతక చర్యలకు సిద్దపడే వ్యక్తిగా, హింసాయుత ఆలోచనలున్న మనిషిగా మిమ్నల్నిమీరు ప్రొజెక్టు చేసుకున్నారు. మీ హయాంలో చేసిన మంచి ఏమీ లేదు. ఎవరి హయాంలోనైనా  రద్దీ సమయాల్లో 80,90 వేల మంది దర్శనానికి వచ్చే సందర్భాలు తిరుమల దేవస్థానంలో దాదాపు సగం రోజులుంటాయి. మిగిలిన రోజుల్లో 50-60 వేలకు ఏరోజూ భక్తుల సంఖ్య తగ్గదు. మీకు మీరు ప్రకటించుకున్నప్రవక్త బీ ఆర్ నాయుడు గారు.. మా హయాంలో అలజడులు, ఆందోళన లేవంటున్నారు.. మొన్ననే మీ హయాంలో ఆందోళన జరిగితే ఇలాంటివి జరుగుతుంటాయి సహజం అన్నారు. మా హయాంలో ఇలాంటి ఆందోళన ఎప్పుడైనా జరిగితే చూపించండి. 
అలాగే దర్శనానికి సంబంధించి వీఐపీ భక్తులకు పెద్దపీట వేయడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు టీటీడీ ఇస్తున్న వీఐపీ భక్తుల కోటా 7,500 దాటుతుంది. మా హాయంలో 5 వేలు దాటిందేమో చూడండి.  నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వేలాది దర్శనం టిక్కెట్లు ఇచ్చాననిచెబుతున్నారు. దానిపై కూడా విచారణ వేయండి. నేను తాగే నీళ్లు కిందనుంచి తెచ్చుకుంటానని చెబుతున్నారు. పాత సినిమాల్లో నాగభూషణంలా, అత్యంత ఉదారమైన భక్తుడిలా మాట్లాడుతున్నారు. మీరు టీటీడీ చైర్మన్ కావడం కోసమే గత ఐదేళ్లు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. అందుకే మీకు చంద్రబాబు కూడా ఆ పదవి ఇచ్చారు. మీరు ఆ మర్యాద కాపాడుకోకుండా... ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయకముందే వాడు జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి రాడు అని రాజకీయాలు మాట్లాడారు. రోజుల తరబడి మా మీద చర్చలు పెట్టి.. మీ భజన దారులను పెట్టి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తినరు, పట్టువస్త్రాలు సమర్పించరు అని మాట్లాడుతున్నారు. బీ ఆర్ నాయుడు గారు మీకు అధికారం తలకెక్కి.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు కంటే మీరే పట్టువస్త్రాలు సమర్పించాలనే కుతూహలంతో ఉన్నట్టు ఉన్నారు. 

వీటికేం సమాధానం చెప్తారు ?
టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు.. హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆనాడు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా 2007 మే నెలలో తీసుకున్న తీర్మానాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా వైయస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మేమే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈవో అధికారికంగా 20 మంది అన్యమతస్తులున్నారని చెబితే.. బీ ఆర్ నాయుడు మాత్రం నా పరిశీలనలో 200 మంది అన్యమతస్తులున్నారని చెబుతున్నారు. నువ్వేమి పాలకమండలి అధ్యక్షుడివి. మీ మధ్య ఎంత సమన్వయలోపం ఉందో.. ఇదే ఉదాహరణ. మీకు, ఈవో కు సమన్వయం లేదని చంద్రబాబు సమక్షంలోనే తేలిపోయింది. 
ఇవాళ కూడా ఏఐ తో రెండు గంటలలో దర్శనం ఇస్తానని చెప్పావు.. మరి మూడో క్యూ కాంప్లెక్స్ కడతానని ఎందుకు నిర్ణయం తీసుకున్నావు.  దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధనవంతుల ఇండ్లలో లక్ష్మీ పూజ చేస్తున్నారని విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. ఇది నిజమా ? కాదా ?
బూతులు నాయుడుగా అందరూ పిల్చుకునే బీ ఆర్ నాయుడు నన్ను చాలా దుర్భాషలాడారు. నేను అలాంటి పదాలు వాడే హీన సంస్కృతి కాదు. ఈ 40 ఏళ్లలో మీరు ఇలాంటి బూతులు ఎంతమందిని వాడుంటారో  అవి మీరే మననం చేసుకొండి. అవన్నీ నేను మిమ్నల్ని అన్నట్టే భావించుకొండి. 
శ్రీవాణి దర్శనం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయితే భక్తులు రద్దీ తగ్గిపోతుందా? ఉదయం శ్రీవాణి దర్శనం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, సాయంత్రం కల్పిస్తామని అనాలోచితంగా మాట్లాడుతున్నారు. మీకు మీరు మేధావిలా మాట్లాడుతున్న మీ మాటలు చూసి టీటీడీ ఉన్నతాధికారులు నవ్వుకుంటున్నారు. టిటిడీ చైర్మన్ గా ఆచరణలో మీరు చేసిన చిన్న పని కూడా లేదు. ఢిల్లీలో స్వామివారి ఆలయంలో నాగప్రతిష్ట చేసారని అన్నాను. దానికి ఎందుకు సమాధానం చెప్పవు?  వైష్టవి ఆలయంలో శైవ సంస్కృతి ఎలా వస్తుంది ?  సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని చెబుతున్నావు. 
 
12 క్యాంటీన్లు కొత్తగా వచ్చాయని చెబుతున్నారు. అంటే ఆ పెద్ద హోటళ్ల వారితో టెండర్లు వేయించి అందులో బీ ఆర్ నాయుడు భాగస్వామి అయి.. కొండమీద వ్యాపారం చేస్తున్నారన్న అనుమానం కూడా కలిసింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ అని చెప్పారు. అందులో ఏం చర్యలు తీసుకున్నారు. బలం, అధికారం ఉందన్న అహంకారంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే. దాన్ని ఒక రోజు కూడా అభినందించలేదు. ఇవాళ మీ హాయంలో జరుగుతున్న తప్పులు ఎత్తిచూపిస్తుంటే... కొండమీద బెల్టు షాపు పట్టుబడితే, క్యూలైన్లో కొట్లాడితే, చెప్పులు వేసుకుని ఆలయం ముందుకు వస్తుందే... మీ సమన్వయలోపంతో భక్తులు దర్శనం కోసం పరుగులు పెడుతుంటే వాటిని పరిష్కరించకుండా మా మీద దాడులు చేస్తున్నారు. మీరు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే... మేం మీ భజనగాళ్ల మాదిరిగా మేం చూస్తూ ఊరుకోం. నాతో పెట్టుకోకు అని మీరు అన్నారు.. మా నుంచి కూడా అదే సమాధానం వస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.  మీ తప్పిదాలను పరిష్కరించే వరకు వాటిని  కచ్చితంగా ఎత్తి చూపుతామనిభూమన టీటీడీ చైర్మన్ ను  హెచ్చరించారు.

Back to Top