తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. కోవిడ్ వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్యం, ఆహారం, శానిటేషన్, కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలపై కీలకంగా చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు, కోవిడ్ కేర్ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులు హాజరయ్యారు.