ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంతిమయాత్ర ప్రారంభం

 వైయ‌స్సార్‌ కడప: బద్వేల్‌ శాసన సభ్యులు డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం ఉంటున్న కో ఆపరేటివ్‌ కాలనీలోని వందన అపార్ట్‌మెంట్‌ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్‌ సమీపంలోని నర్సింగ్‌ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగుతుంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, నిన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌డ‌ప న‌గ‌రంలోని వెంక‌ట సుబ్బ‌య్య పార్థీవ దేహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌గాఢ ‌సానుభూతికి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top