విశాఖలోని అంగన్‌వాడి కేంద్రాన్ని సంద‌ర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

 విశాఖపట్నం: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ టీచర్ అవతారమెత్తారు. విశాఖలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ చిన్నారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న ఆహార పదార్థాలు ఇతర అంశాలను పరిశీలించారు. చిన్నారులతో కలిసి మెనూ భోజనాన్ని తీసుకున్నారు.

అంతకు ముందు ఆమె చిన్నారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. టీచర్ మాదిరిగా వారితో రైమ్స్ చదివించారు. చిన్నారులు కూడా హుషారుగా మంత్రి ఉష శ్రీ చరణ్‌తో గడిపారు. అనంతరం ఆమె గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. అయిదేళ్లు నిండిన చిన్నారులకు ఫ్రీ గ్రాడ్యుయేషన్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top