వైయస్ఆర్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో వైయస్ఆర్‌సీపీ నేతకు చెందిన ఆస్తులకు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో సదరు నేతకు చెందిన చికెన్ సెంటర్‌తో పాటు ఇతర సామగ్రి దగ్ధమైనట్లు సమాచారం. నామినేషన్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత వైయస్ఆర్‌సీపీ నేతను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అవినాష్‌రెడ్డి, దాడులు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని, ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్‌చార్జిలు వైఎస్ మనోహర్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.