తాడేపల్లి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనాలను తిరిగి పునఃప్రారంభించాలని కోరుతూ టీటీడీ ఈఓ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన చేసింది.