సీఎం వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మంత్రి వర్గసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు. నూతన మంత్రి వర్గం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు వెల్లడించాయి.

Back to Top