అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. మెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ తీర్మానించింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణపై చర్చ జరిగింది. అరకు నాలుగు జిల్లాలకు విస్తరించి ఉందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం వైయస్ జగన్ సూచించారు. రాయలసీమకు ప్రత్యేక కార్పొరేషన్ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దు కోసం గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టగా అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుంటూరులో చంద్రబాబు సభలో పాల్గొన్న ముస్లిం యువకులను అప్పట్లో అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసును కూడా ఉపసంహరించుకుంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒంగోల్, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఆమోదం. వైయస్ఆర్ చేయూత పథకానికి ఆమోదం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైయస్ఆర్ చేయూత పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాడు-నేడు పథకం ద్వారా స్కూళ్ల అభివృద్ధికి కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇప్పటికే ఈ పథకానికి రూ.920 కోట్లు విడుదల చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలన్నీ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్ని నాని తెలిపారు. ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు.. ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మైనింగ్ కార్యకలాపాలపై సాండ్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మైనింగ్ కార్యకలాపాలను ఈ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు.