కొన‌సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార‍్యక్రమం కొనసాగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయసభల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విన్నపంతో కియా మొదటి ప్లాంట్‌ను ఏపీలో పెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కియా మోటార్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ 2007 నుంచే వైఎస్సార్‌తో తనకు అనుబంధం ఉందని కియా సీఈఓ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆటో మొబైల్స్‌లో పెట్టుబడులు పెట్టాలని వైఎస్సార్‌ 2007లోనే  తనకు చెప్పారని కియా సీఈఓ లేఖలో రాశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. చంద్రబాబులా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేద’’ని అన్నారు.

చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారంః కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుతో ప్రజలపై భారం పడిందని అన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.39కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని, ఆయన అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు.

Back to Top