టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన అభ్యంతరం

అమ‌రావ‌తి:  ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఓవర్‌ యాక్షన్ చేశారు. స్పీకర్‌ చైర్‌ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. వారి తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బుగ్గ‌న స్పందించారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. సభను సాగనీయకుండా ప్రతిరోజూ అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని  బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top