పబ్లిసిటీకి వందల కోట్లు దుర్వినియోగం

ధర్మపోరాట దీక్షల పేరుతో డ్రామాలు

హోదా నినాదం సజీవంగా ఉంది వైయస్‌ జగన్‌ వల్లే

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజు

విశాఖపట్నం: పబ్లిసిటీ కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు ఖర్చు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి ప్రదీప్‌రాజు ధ్వజమెత్తారు. విశాఖలో ప్రదీప్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నాలుగున్నరేళ్లుగా పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరగనున్నాయని ధర్మపోరాట దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. పెన్షన్లు, డ్వాక్రా చెక్కులు అని జిమ్మిక్కులు చేయబోయారు. అవి అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఢిల్లీ దీక్ష అని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా చంద్రబాబు మాదిరిగానే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తయారయ్యారన్నారు. అందినకాడికి దోచుకుంటూ పాలనను గాలికొదిలేశారన్నారు. 

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజుపట్నం పోర్టు గురించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక పోరాటాలు చేసింది.. చేస్తుందని ప్రదీప్‌రాజు అన్నారు. ప్రత్యేక హోదా నినాదం సంజీవంగా ఉండటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారణమన్నారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని దీక్ష చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. 

Back to Top