ఇస్రో బృందానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు

తాడేప‌ల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..  సూర్యుడిపై పరిశోధనల క్రమంలో ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా  ప్రవేశపెట్ట‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు.  
ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం సక్సెస్‌ అయ్యిందని, నిర్దేశిత కక్ష్యలోకి ఉప్రగహాన్ని పీఎస్‌ఎల్వీ ప్రవేశపెట్టిందని,  వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని  ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ఇస్రో బృందానికి అభినంద‌న‌లు తెలిపారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను ఇది సాధించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు

Back to Top