హైదరాబాద్: చంద్రబాబు విధానాలు నచ్చక టీడీపీని వదిలిపెట్టామని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీడీపీని రాజీనామా చేసిన ఆయన ఇటీవల వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇవాళ అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రబాబుతో కలిసి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవం చంపుకొని టీడీపీలో పనిచేశామన్నారు. మా జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. టీడీపీలో మా రోదన అరణ్య రోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వదిలిపెట్టి వైయస్‌ఆర్‌సీపీలో చేరామని పేర్కొన్నారు.