సీఎం వైయస్‌ జగన్‌తో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ బృందం భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి సహకరిస్తామని ఈ బృందం వెల్లడించింది.  ఐదేళ్లలో రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సమర్ధంగా రూపొందించాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. సేంద్రీయ ఎరువులను రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. భవిష్యత్తులో పూర్తి నాణ్యత కలిగిన ఎరువులు, విత్తనాలు ల్యాబ్‌ల్లో తనిఖీ చేశాకే రైతులకు అందేలా చూస్తామన్నారు. ఈ ¿ô టీలో ఫౌండేషన్‌ సీఈవో ఆనంద్‌ విశ్వనాథ్, మంత్రి కన్నబాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top