జగన్నామ సంక్షేమ సంవత్సరంగా 2022

అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి
 
 కరువులోనే చంద్రబాబు రికార్డు
 
బాబు పాలనలో అంతా కరువు. జగన్ గారి పాలనలో పండుగలా వ్యవసాయం

మూడున్నరేళ్ళలోనే వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగా రూ. 85,295.98 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇది

 వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళ కోసం రూ. 51,662 కోట్లు ఖర్ఛు

 బాబువి కోతలు.. సీఎం వైయ‌స్ జగన్ గారివి చేతలు

తాడేపల్లి: 2022వ సంవ‌త్స‌రం జగన్నామ సంక్షేమ సంవత్సరమ‌ని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాభదాయకంగా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను మించిన సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతులకు అండగా నిలిచారు. మూడున్నరేళ్ల కాలంలో రైతులకు ఎంతో మేలు జరిగింది. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలిచారు.
చంద్రబాబు హయాంలోనే ఖరీఫ్‌లో ఉత్పత్తి అతి తక్కువగా జరిగింది. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అత్యధికంగా ఖరీఫ్‌లో ఉత్పత్తులు సాధించారు. లాభదాయక పంటలు పండించే విధంగా ప్రభుత్వం పని చేస్తోంది. హార్టికల్చర్‌ సాగు కూడా పెరిగింది. ఆక్వా కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్‌ ఈ మూడు రంగాలు కలిపి సాగు అంచనాలు వేస్తారు. 40 శాతం హార్టికల్చర్‌ ఉత్పత్తులు పెరిగాయి. దేశంలోనే రాష్ట్రంలో పండ్లు, కూరగాయాల సాగులో అగ్రగామీగా నిలిచిందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. 


 
 

Back to Top