2021–22 జగనన్న 'సంక్షేమ క్యాలెండర్‌'

ఏ నెలలో ఏ సంక్షేమ పథకమో.. చెప్పి మరీ అమలు చేస్తున్నాం

విలేకరుల సమావేశంలో సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించిన మంత్రి పేర్ని నాని

సచివాలయం: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, ఏ మాసంలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామో.. ముందుగానే ప్రకటించి అమలు చేస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 2021–22 సంవత్సరానికి గానూ జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు లేకుండా.. ఏ మాసంలో ఏ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందో ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంక్షేమ పథకాల క్యాలెండర్‌ వివరాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఏప్రిల్‌ మాసంలో 
– జగనన్న వసతి దీవెన మొదటి విడత.
– జగనన్న విద్యా దీవెన మొదటి విడత.
– 2019 రబీకి రైతులకు సున్నావడ్డీ చెల్లింపులు.
– డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ చెల్లింపులు 

మే మాసంలో.. 
– 2020 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా చెల్లింపులు
– వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం
– వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే మత్స్యకార భరోసా పథకం, డీజిల్‌ సబ్సిడీ కూడా అమలు చేయనున్నాం.

జూన్‌ మాసంలో
– వైయస్‌ఆర్‌ చేయూత పథకం. (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల సాయం.)
– జగనన్న విద్యా కానుక 

జూలై మాసంలో 
– జగనన్న విద్యా దీవెన రెండవ విడత.
– వైయస్‌ఆర్‌ కాపు నేస్తం
– వైయస్‌ఆర్‌ వాహన మిత్ర

ఆగస్టు మాసంలో 
– రైతులకు 2020 సంవత్సరానికి గానూ ఖరీఫ్‌కు సున్నావడ్డీ చెల్లింపులు, 
– మధ్య తరహా పరిశ్రమలు, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకం.
– వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం
– అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు

సెప్టెంబర్‌ మాసంలో
– వైయస్‌ఆర్‌ ఆసరా. 
(డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బ్యాంకులో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత బకాయి ఉంటే.. అంత బకాయిని నాలుగు విడతలుగా ఇస్తామని ప్రకటించాం)

అక్టోబర్‌ మాసంలో 
– రైతు భరోసా రెండవ విడత
– జగనన్న చేదోడు
– జగన్న తోడు

నవంబర్ మాసంలో
– అగ్రవర్ణాల్లో బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ, ముస్లింలోని ఆర్థిక వెనుకబాటు ఉన్న మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అమలు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున రూ.45 వేలు అందించనున్నాం.

డిసెంబర్ మాసంలో
– జగనన్న వసతి దీవెన రెండవ విడత
– జగనన్న విద్యా దీవెన మూడవ విడత
– వైయస్‌ఆర్‌ లా నేస్తం

జనవరి 2022లో
– రైతు భరోసా మూడవ విడత
– జగనన్న అమ్మ ఒడి
– వైయస్‌ఆర్‌ ఆసరా పెన్షన్‌ పెంపు (రూ.2250 నుంచి రూ.2500)

ఫిబ్రవరి 2022లో 
– జగనన్న విద్యా దీవెన నాల్గవ విడత కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 

Back to Top