24ఏళ్ల‌ క‌ల సాకారం..సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

సీఎంను క‌లిసిన 1998 డీఎస్సీ అభ్య‌ర్థులు

పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అభ్య‌ర్థులు

తాడేప‌ల్లి: 1998 డీఎస్సీ అభ్య‌ర్థులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని 1998 డీఎస్సీ అభ్య‌ర్థులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.  24ఏళ్ల‌ క‌ల‌ను సాకారం చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధ‌న్యవాదాలు తెలిపారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిలబెట్టుకున్నారు. 24 ఏళ్ల‌ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసిన 1998డీఎస్సీ అభ్య‌ర్థులు.. ఈ సంద‌ర్భంగా సీఎంను ఘ‌నంగా స‌త్క‌రించారు. డీఎస్సీ అభ్య‌ర్థుల వెంట ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు. 

Back to Top