సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన 108, 104 ఉద్యోగులు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని 108, 104 ఉద్యోగులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 108, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.  108 టెక్నీషియన్‌కు రూ.30వేలు, పైలెట్‌కు రూ.28 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. 104 ఉద్యోగులకు రూ.28 వేలు, డ్రైవర్‌కు రూ.26 వేలు జీతం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. 104 వైద్యులకు సర్వీస్‌ మెయిటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
 
 Read Also: ఐదేళ్ల తరువాత ఏపీకి పండుగ

Back to Top