తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డిపై, పార్టీపై కూటమి నేతలు, ఎల్లోమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్‌నాధ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ వింగ్ సభ్యులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో, మన నాయకుడు జగన్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్ధమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామం. సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైయస్ఆర్‌సీపీపై, వైయస్ జగన్ గారిపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కునే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి. ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్దం కావాలి. రాష్ట్రస్ధాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి. పార్టీ నిర్మాణంలో, వైయస్ జగన్ గారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళడంలో మీరంతా క్రియాశీలకంగా పనిచేయాలి.