23న చంద్రబాబు దీపం ఆరిపోతుంది

ఓడిపోతారని తెలిసే చిత్రవిచిత్ర ధోరణిలో బాబు

ఈసీ, ఈవీఎంలపై అనుమానం సృష్టించాలనే కుటిల ప్రయత్నం

బాబుతో కలిసి ఏపీపీఎస్సీ ఓటర్లను ప్రభావితం చేస్తోంది

ఏపీపీఎస్సీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడ: ఈ నెల 23వ తేదీన చంద్రబాబు పదవి దీపం ఆరిపోతుందని, క్యాడర్‌ను నమ్మించేందుకు, తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే దురాశతో ప్రవర్తిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి పదవిని ప్రతిపక్ష నేతగా మారాల్సిన పరిస్థితిని జీర్ణించుకోలేక చంద్రబాబు చిత్ర విచిత్ర ధోరణితో వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రజలు మెడపట్టి గెంటేసినా సురిపట్టుకొని వేలాడే వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు, ఏపీపీఎస్సీ వైఖరిపై వైయస్‌ఆర్‌ సీపీ నేతలు అంబటి రాంబాబు, ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఓటమి భయంతో చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని, ఓటేసి వచ్చిన తరువాత సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్‌కు పడిందని మాట్లాడారన్నారు. చంద్రబాబు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క ఓటర్‌ కూడా ఇలాంటి కంప్లయింట్‌ చేయలేదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్, ఈవీఎంల మీద ప్రజలకు ఒక అనుమానం సృష్టించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గెలపుకోసం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నాడని, వ్యవస్థల్లోకి తన సొంత వ్యక్తులను ప్రవేశపెట్టి అనుగుణంగా మార్చుకోవాలని చూశారన్నారు. దీనిపై వైయస్‌ఆర్‌ సీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. ఇంటలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే చంద్రబాబు గందరగోళం సృష్టించారన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు–2 ప్రశ్నపత్రంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్నలు వేసిందన్నారు. నందమూరి తారకరామారావు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ పెట్టారని, అంతేకాకుండా పసుపు కుంకుమ, చంద్రన్న పెళ్లి కానుక గురించి కూడా ప్రశ్నలు అడిగారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుండా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏపీపీఎస్సీ ఎందుకు వ్యవహరిస్తుందని అంబటి ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ చైర్మన్, అందులో కొంత మంది సభ్యులు చంద్రబాబు మనుషులేనన్నారు. ఇంకా నయం చంద్రబాబు మనవడు పేరేంటీ..? లోకేష్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గం పేరేంటీ అని అడగలేదు సంతోషమన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా, నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు, వ్యవస్థలపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యం బతకదని ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.  

పోలవరం పూర్తి చేసి నీరు అందించి 2019లో ఓట్లు అడుగుతానని చెప్పి మాట నిలబెట్టుకోలేని చంద్రబాబుకు ఆ ప్రాజెక్టు సందర్శించే నైతిక హక్కులేదన్నారు. నేను 8వ తేదీ వరకు ముఖ్యమంత్రినే అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, అప్పటి వరకు జీతాలు తీసుకోవచ్చు, కార్లు వాడుకోవచ్చు కానీ, ఎన్నికల నియమావళి ఉన్న సమయంలో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించకూడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇరిగేషన్‌ మంత్రి ప్రతిపక్షనేతను ఉద్దేశిస్తూ బట్టకొట్టి రాసుకో జగన్‌ 2019లో పోలవరం నీరు ఇస్తున్నామని మాట్లాడాడని, ఇవాళ ఇరిగేషన్‌ మంత్రి ఆయన తలకాయ గోడకు వేసుకొని రాసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలను గమనించారని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. 23వ తేదీన ఫలితం తేటతెల్లమవుతుందని, చంద్రబాబు ఆరిపోతుందన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top