తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే, ఆ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైయస్ఆర్‌సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైయస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ వైయస్ఆర్‌సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు.