పార్వతీపురం మన్యం : ఏబీఎన్ రాధాకృష్ణపై ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 9వ తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. అలాగే వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్, జడ్పీటీసీ ప్రతినిధి సవర రాము, సవర చంద్రశేఖర్, సవర సాయి కుమార్, కందుల వెంకట నాయుడు, మిడితాన కళ్యాణి తదితరులు హాజరయ్యారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.