తాడేపల్లి: సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుధ్ధంగా వ్యాఖ్యలు చేయడంపై అచ్చెన్నాయుడులపై ఆగ్రహం. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు. వైయస్ఆర్ సీపీ ఫిర్యాదులపై స్పందించిన ఈసి వాటికి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. వైయస్ జగన్ పై అభ్యంతరకర,అనుచిత వ్యాఖ్యలు చేయడం,సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడంపై ఈనెల రెండో తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. వాటికి సంబంధించి ఆధారాలను సైతం ఎన్నికల కమీషన్ కు అందచేశారు.ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.పెత్తందారు జగన్,పెన్సన్ నిధులను మళ్ళించారంటూ వైయస్ జగన్ గారిపై కార్టూన్ లు తయారుచేసి వాటిని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆధారాలు లేళ్ళ అప్పిరెడ్డి ఈసికి అందించారు.