పోలవరంపై చంద్ర‌బాబు కట్టుకథలు

వైయ‌స్ఆర్‌సీపీ కౌంటర్‌

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పందించారు.  చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన అనంతరం వాస్తవాలను మాట్లాడకుండా ఏవో కట్టు కథలు చెప్పడంపై  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజె​క్ట్‌ను 72 శాతం పూర్తి చేశాం. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు.ఈ ప్రాజెక్ట్‌పై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి 4 ఏళ్ళు  పడుతుందని అధికారులు అంటున్నారు’ అని చంద్రబాబు మీడియా ముందు మాట్లాడారు. మరి అసలు వాస్తవాలను పక్కనపెట్టిన చంద్రబాబుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పలు ప్రశ్నలు సంధించారు.

1)ఖర్చు 18శాతం అయితే 72 శాతం ఎలా పూర్తి చేస్తారు?
పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తి..డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు.ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా

ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం.అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి 4 ఏళ్ళు  పడుతుందని అధికారులు అంటున్నారు చంద్రబాబు

పోలవరం కోసం బాబు హయాములో రాష్ట్రం  పెట్టిన ఖర్చు రూ.10వేల కోట్లు అని ఆంధ్ర జ్యోతి రాసింది. 55 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్ లో 10వేల కోట్లు అంటే 18 శాతం  ఖర్చు చేసి 72 శాతము పూర్తి చేశాను అంటే ఎట్లా?

2)డయాఫ్రమ్‌వాల్‌

గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేశాక ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలి. కానీ.. నాటి సీఎం చంద్రబాబు  వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే ..డయాఫ్రమ్‌వాల్‌ పనులను ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలకు నామినేషన్‌పై సబ్‌ కాంట్రాక్టుకు అప్పగించారు. పనులు చేసిన ఆ సంస్థలకు రూ.400 కోట్లు బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు.

ఆ తర్వాత రూ.2,917 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో 
ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒక వైపున 400 మీటర్లు, మరో వైపున 350 మీటర్ల వెడల్పుతో  ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు చంద్రబాబు

2019 లో గోదావరి వరద కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాలగుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది.దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్‌ ఐఐటీ నివేదిక ఇచ్చింది.

సీఎం వైయ‌స్ జగన్‌ 2019 మే 30న అధికారం చేపట్టారు. 2019 జూన్‌లో గోదావరికి వరదలు వచ్చాయి. నవంబర్‌ వరకూ గోదావరి వరదెత్తింది.వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను సీఎం వైయ‌స్ జగన్‌ పూర్తి చేశారు. స్పిల్ వే  అప్రోచ్ ఛానల్ కూడా  వైయ‌స్ జగన్  పూర్తి చేశారు.

3)ఈ ప్రాజెక్టును వందసార్లు సమీక్షించారట.. 30 సార్లు సందర్శించారట!

కమీషన్ ల కోసం  వారం వారం పోలవరం అని మా మీద వత్తిడి తెచ్చాడు బాబు అని పోలవరం కాంట్రాక్టర్ కొడుకు రంగారావు ఇటీవల చెప్పాడు

4)ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమా?

మీరు పోలవరం కాంట్రాక్టర్ రాయపాటికి మార్చి  రామోజీ వియ్యంకుడు అయిన నవయుగ కు టెండర్ ద్వారా కాకుండా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు  ఇస్తే ...
వైయ‌స్ జగన్ ఓపెన్ టెండర్ పిలిచి రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసిన ఆసియా లోనే పెద్ద కంపెనీ అయిన మేఘా ఇంజినీరింగ్ కు ఇచ్చారు

5) వైయ‌స్ జగన్ నే సాక్షి లో రాసి పెట్టుకో అని బీరాలు పోలేదా?
2018కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తాం అని మీ  మీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా చౌదరి నిండు అసెంబ్లీలో  కోయలేదా’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు.. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ధ్వజమెత్తుతున్నారు.

Back to Top