నాటి పాదయాత్ర..నేటి సంక్షేమ పరిపాలనకు బీజం.. 

 
చరిత్రాత్మకమైన వైయ‌స్ జ‌గ‌న్  ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తై 3 ఏళ్ళు 

  దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం వైయ‌స్ జగన్ గారి 3,648 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర

 తన తండ్రి డా. వైయస్ఆర్ లా పేదవాడి గుండెల్లో బతకాలన్న కసే  వైయ‌స్ జగన్ ను ముందుకు నడిపించింది

కొప్పరపాలెంలో వైయస్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట 

 ఎన్టీఆర్ చావుకు కారణమైనవారే వందేళ్ళ జయంతి ఉత్సవాలు అనడం సిగ్గుచేటు 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు  లేళ్ళ అప్పిరెడ్డి  

తాడేప‌ల్లి: కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగిన జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తై జనవరి 9 నాటికి మూడేళ్ళ అవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మీడియాకు వివరించారు. 

- అలానే, 3,648 కిలోమీటర్ల జగన్ మోహన్ రెడ్డిగారి పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ పెను సంచలనం అని అన్నారు. రాష్ట్రంలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 నెలలపాటు, ఎండనక, వాననక, నిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. లక్షల మందిని నేరుగా కలుసుకుంటూ సాగిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల గుండెల్ని హత్తుకుందని చెప్పారు. 2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర.. 2019 జనవరి 9న ముగిసిందన్నారు. పాదయాత్రలోనే మూడు సంవత్సరాల క్యాలెండర్లు మారాయని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజల పట్ల బాధ్యత, చిత్తశుద్ధి ఎలా ఉంటాయో.. పాదయాత్రలో ప్రజలు కళ్ళారా చూశారని, ఈరోజు అధికారంలోకి వచ్చాక నవరత్నాల ద్వారా ఆ సంక్షేమ ఫలాలను  ఇంటింటా అనుభవిస్తున్నారన్నారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎలా ఉంటాడో.. జగన్ మోహన్ రెడ్డిగారిని చూసే భవిష్యత్తు రాజకీయ తరాలు నేర్చుకుంటాయన్నారు. 

 డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం 

 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని కొప్పరపాలెంలో డా. వైయస్ విగ్రహంపై పెట్రోలు పోసి, నిప్పంటించిన ఘటనను అప్పిరెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులను శిక్షించాలని కోరారు.  ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే నైజం టీడీపీదేనన్నారు. మొన్న పల్నాడులో ఒక తాగుబోతు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారంటూ.. గగ్గోలు  పెట్టిన టీడీపీ నేతలు,  వైయస్ రాజశేఖరరెడ్డిగారి విగ్రహానికి జరిగిన దుశ్చర్యను ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు. విగ్రహాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం టీడీపీకి మొదటి నుంచీ అలవాటే అన్నారు. రాజశేఖరరెడ్డిగారు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న మహా నాయకుడు అని, ఎవరూ ఆ ముద్రను చెరపలేరని అన్నారు. 

- ఎన్టీఆర్ చావుకు కారణమై, ఆయన పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఈరోజు ఎన్టీఆర్ కు వందేళ్ళ జయంతి కార్యక్రమాలు అని మాట్లాడటం చూస్తుంటే..  రాజకీయాల్లో ఇంతకంటే నీచ, నికృష్ట సంస్కృతి మరొకటి ఉంటుందా అని అప్పిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిగారు రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పెంపొందించాలని చూస్తుంటే.. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఇంకా దిగజారుడు, మూస రాజకీయాలు చేస్తూ.. ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top