ప్రపంచ వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

 అమెరికా, లండన్‌లో సభలు, సమావేశాలు
 
నిండునూరేళ్లు జీవించాలని ఆశీర్వాదం

 అమరావతి: నవరత్నాల విప్లవ సారధి, విలువలు, విశ్వసనీయతలో శిఖర సమానం ఆలోచన, ఆచరణలో అభ్యుదయ మార్గం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న గొప్ప అభ్యుదయ మూర్తి, సంస్కరణల సమ్మేళనంలో సృజనాత్మక నైపుణ్యం, పాలన, పరిశ్రమలో దార్శనిక సంకల్పం, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ కుదేలైన వ్యవస్థలను గాడిన పెట్టిన గొప్ప నేర్పరితనం  అన్ని కలగలపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల ఉన్న ప్రవాసాంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. ఆయన పుట్టినరోజు పురష్కరించుకుని గురువారం ఖండాంతరాల్లో ఉన్న  ప్రతి గుండె, ప్రతి గొంతు ఆయనకు మనసారా శుభాకాంక్షలు తెలిపింది. 

 


సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీటెల్‌లో ప్రవాసాంధ్రులు తయారు చేయించిన కేక్‌

జీవించు వందేళ్లు.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ మనసారా ప్రవాసాంధ్రులు దీవించారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసాంధ్రులు ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ పరిశ్రమల నిర్వాహకులు రెండోరోజు సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసి, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి జననేత జగనన్న పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. యూఎస్‌ఏలోని సీటెల్, డల్లాస్, అట్లాంటా, కువైట్, సింగపూర్‌ కత్తర్‌(డోహ), దుబాయ్‌(యూఏఈ) దేశాల్లో సీఎం జగన్‌ పుట్టిన రోజు సంబరాలను కన్నుపండుగా  నిర్వహించారు. 


డల్లాస్‌(యూఎస్‌ఏ)

యూకేలోని వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం ఇన్‌ఛార్జ్‌ శివారెడ్డి, మనోహర్‌ నక్కా, విజయ్‌ వైకుంఠం, మైరెడ్డి వాసుదేవరెడ్డి, మలిరెడ్డి కిషోర్‌ రెడ్డి, అనంత రాజు పరదేసి, సురేందర్‌ రెడ్డి నేతృత్వంలో తెలుగువారు, వైఎస్సార్, జగనన్న అభిమానులు, కార్యకర్తలు జగనన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా కలర్స్‌ ఉన్న బెలూన్లను ఎగురవేశారు. పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి స్వీట్లు పంచారు. యూకే యూరప్‌ వింగ్‌ వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం ఇన్‌ఛార్జ్‌ శివారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జగనన్నకు తామంతా అండగా నిలబడతామన్నారు. ఏపీ నుంచి దుష్టచతుష్టయాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 175 స్థానాలు సాధించేందుకు తమ వంతు సహకారం వైఎస్‌ జగనకి అందిస్తామన్నారు. సీఎం జగన్‌ తిరిగి 2024లో ఏసీ సీఎం కావడం చారిత్రక అవసరం అని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రసిడెంట్‌ మేడపాటి వెంకట్‌ అన్నారు.


కువైట్‌


కువైట్‌


సింగపూర్‌

 


అట్లాంటా(యూఎస్‌ఏ)


లండన్‌

Back to Top