ఫ్యాను గుర్తుకు ఓటు.. జగనన్న పాలనకు ఓటు

ఆత్మకూరులో గెలుపు.. అభివృద్ధిలో మేలుమలుపు

ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి విస్తృత ప్ర‌చారం

  నెల్లూరు:  ఆత్మ‌కూరు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్ర‌చారంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి విక్ర‌మ్ రెడ్డి దూసుకుపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి వెళ్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే..జ‌గ‌న‌న్న పాల‌న‌కు ఓటు వేసిన‌ట్లే అని ప్ర‌చారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఉప ఎన్నిక మనం ఊహించినవి కావు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి  22వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు. మేకపాటి విక్రమ్రెడ్డి గారిని మన అభ్యర్థిగా నిలబెట్టాం. ఆయన్ను గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని, పని చేస్తున్న జగనన్న పాలనకు మద్దతు పలకాలని ఆత్మకూరులోని ప్రతి ఇంటా ఉన్న ప్రతి ఒక్కరికీ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు విజ్ఞప్తి చేస్తున్నాం.

వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నాటి నుంచి జరిగిన రెండు జనరల్ ఎన్నికల్లోనూ  ఆత్మకూరు ప్రజలు మన పార్టీ పక్షాన నిలిచారు. 2014, 2019 ఈ రెండు ఎన్నికల్లోనూ, మన పార్టీ అభ్యర్థి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నే గెలిపించారు. 2004-09 మధ్య మహానేత చేసిన మేలును ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గుర్తుంచుకున్నారు. 2019లో జననేత వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన వాటి నుంచి ఈ నియోజకవర్గంలోని ఇంటింటికీ మనిషి మనిషికీ మేలు చేసే పాలన అందిస్తున్నారు. నవరత్నాలు కానివ్వండి. ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి... ప్రతి ఒక్కటి అందరికీ అందిస్తున్నారు. 

ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ మూడేళ్లలో సుమారు 2.51 లక్షల మంది ప్రత్యక్ష నగదు బదిలీ లబ్ధిపొందారు. వీరికోసం జగనన్న ప్రభుత్వం రూ.705.12 కోట్లు ఖర్చు చేసింది.  ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ మూడేళ్ల‌లో సీసీ రోడ్లు, సీసీ కాల్వ‌లు, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు, నీటి స‌ర‌ఫ‌రా, క‌ల్వ‌ర్టులు, ప్ర‌జోప‌యోగ భ‌వ‌నాలు, అర్చీలు వంటి వాటి నిర్మాణాల‌కు, విద్యుదీక‌ర‌ణ ప‌నులు, న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ‌కు, ఇతర అభివృద్ధి ప‌నుల‌కు మొత్తంగా రూ.173 కోట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. వైయ‌స్ జగన్ గారు చేసిన అభివృద్ధిని విజ్ఞులైన ఆత్మకూరు ప్రజల ముందు ఉంది. ప్యాన్ గుర్తు మీద ఓటు వేసి, మేకపాటి విక్రమ్ రెడ్డి కి అఖండ విజయం చేకూర్చాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  విజ్ఞప్తి చేస్తున్నారు.  కులాలు మతాలూ వర్గాలూ ప్రాంతాలూ చివరికి రాజకీయాలు కూడా చూడకుండా ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న - ఏకైక ప్రభుత్వం మనది. అవినీతి, పక్షపాతం లేకుండా పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం మనది. ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.     

 

ఆత్మకూరు నియోజకవర్గంలో  వైఎస్ జగన్ మోహన రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు చూద్దాం...

1) ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా,  సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్ పుట్ సబ్సిడీ..ఇలా వ్యవసాయ రంగానికి ఈ మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.126 కోట్లు...

2) నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుల నిర్మాణానికి రూ.55 లక్షల మంజూరు...

3) వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద సుమారు రూ.2.8 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా విడుదల చేసింది...

4) నియోజకవర్గానికి 84 రైతు భరోసా కేంద్రాలు, 84 గ్రామ వార్డు సచివాలయాలు, 60 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 84 బల్క్‌ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 76 డిజిటల్ లైబ్రరీలు మంజూరయ్యాయి...

5) మునిసిపాలిటీలో చావిడి నుంచి సోమశిల  జంక్షన్ వరకు రూ1.40 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం...

6) మునిసిపాలిటీలో... మునిసిపాలిటీ భవన నిర్మాణం, కౌన్సిల్ హాల్ నిర్మాణం, ఫర్నిచర్ సౌకర్యం, ఇతర సదుపాయాల కల్పన, సీసీ రోడ్లు, కూరగాయాల మార్కెట్ అభివృద్ధి, వీధి దీపాలు,  తాగునీటి సరఫరా కోసం వాల్వులు, బోర్ వెల్స్‌, బోర్ మెటీరియల్ పంపిణీ, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు  సుమారు రూ.87 కోట్ల వ్యయం...

7) మునిసిపాలిటీలో తడి, పొడి చెత్త వేరు చేసేందుకు రూ.32 లక్షల వ్యయంతో ఇంటింటికి డస్ట్ బిన్‌ల పంపిణీ...

8) నియోజకవర్గంలో రూ.2.31 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం.  రూ.80 లక్షలతో  పట్టణ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం...

9) మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీకి సంబంధించి శ్లాబులు, గేట్లు వంటి పనులకు ఈ మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.110.62 కోట్లు...

10) ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ పనులకు సంబంధించి పంప్ హౌజ్‌, సంప్‌,  ప్రెషర్ మెయిన్ వంటి పనులకు  ఈ మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.70  కోట్లు...

11) రాళ్లపాడు రిజర్వాయర్ నీటి సరఫరాకు నార్త్ ఫీడర్ ఛానల్ (GKN కాలువ) పనుల మొత్తం అంచనా వ్యయం రూ.632 కోట్లు. 30 శాతం పనులు పూర్తి...

12) సోమశిల ప్రాజెక్టుకు మరమ్మతుల మొత్తం అంచనా వ్యయం రూ.117 కోట్లు. 10 శాతం పనులు పూర్తి...

13) రూ.525 కోట్ల అంచనాతో ప్రారంభమైన సోమశిల ఉత్తర కాలువ పనులు...

14) ఆత్మకూరు నియోజకవర్గంలో సీపీ రోడ్లు, సీసీ కాలువలు, అంతర్గత రహదారులు, నీటి సరఫరా, కల్వర్టులు, ప్రజాపయోగ భవనాలు, ఆర్బీకేల వంటి వాటి నిర్మాణాలకు, విద్యుదీకరణ పనులు, నగర సుందరీకరణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఈ మూడేళ్లలో మొత్తంగా రూ.173 కోట్లు ఖర్చు చేసిన వైఎస్‌ జగన్  ప్రభుత్వం...

కులం, మతం, వర్గం,  ప్రాంతాలకు అతీతంగా చివరకి రాజకీయాలు కూడా చూడకుండా  ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ది ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్‌  ప్రభుత్వం... 

పక్షపాతం లేకుండా పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన రెడ్డి గారి ప్రభుత్వం...

ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలలో మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి...

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top