శవ రాజకీయాలు

ప్రశ్నించేందుకు ఏది లేక బాబు అండ్‌ పార్టనర్‌ పచ్చి అబద్దాలు

భవన నిర్మాణ కార్మికుడు నాగ బ్రహ్మాజీ ఆత్మహత్యపై కట్టుకథలు

టీడీపీ పాలనలో ఆమాయక ప్రజలు ఆత్మహత్యలపై ఏనాడైనా ప్రశ్నించావా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్ని నాలుగు నెలల్లోనే 80 శాతం నెరవేర్చారు. దీంతో ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలకు ఏ ఒక్క సమస్య కనిపించడం లేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వరుణుడు ముఖం చాటేశాడు. కరువు, కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారు. జలాశయాలు అడుగంటి పోయాయి. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వేళా విశేషం. రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండుకుండాల నీటితో కళకళలాడుతున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి  వరద నీరు రావడంతో నదుల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ శవ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇటీవల ఆత్మహత్య  చేసుకున్న భవన కార్మికుడు నాగ బ్రహ్మాజీ పై మొసలి  కన్నీరు కార్చిన పార్టనర్ పవన్‌ కట్టుకథలు అల్లాడు. ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రబాబు అను"కుల'మీడియాలో రాయించి రాజకీయం చేశారు. చంద్రబాబు క్లాప్‌ కొట్టగానే పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌ మొదలుపెట్టాడు. తాను రాజకీయాల్లోకి వచ్చిన ఇన్ని రోజుల్లో పిల్లికి బిచ్చం పెట్టని పార్ట్‌నర్‌ నాగ బ్రహ్మజీ కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం అందించి ఫోటోలకు ఫోజులు కొట్టారు. నాగబ్రహ్మాజీ ఆత్మహత్యపై వాస్తవాలు ఒక్కసారి గమనిస్తే..  నాగ బ్రహ్మాజీకి ఇద్దరు భార్యలు ఉన్నారు.  కుటుంబ తగాదాలు,  ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్మ చేసుకున్నట్లు సొంత తమ్ముడు పోలీస్ విచారణలో చెప్పాడు.

ఉపాధి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారా? 
వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 5 నెలలు కావొస్తోంది. ఈ ఐదు నెలల్లో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకపోతేనే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటాయా అని సామాన్య జనానికి కూడా అనుమానం రాకమానదు. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. ఇలా ఉపాధి లేని వారు ఈ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. చేసుకునేందుకు ఇంకా చాలా రకాల పనులు ఉన్నాయి.  ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పనులు లేక రైతులు కూలీలుగా మారి వలసలు వెళ్లారు. అప్పులబాధలు తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తనువు చాలించారు. బాబు సీఎం గా ఉన్న గత అయిదేల్లో 2,365 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 300  మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రిన్సిపాల్  బాబూరావు చౌదరి  కారణంగా  దళిత స్టూడెంట్స్ రితికేశ్వరి ఆత్మహత్య  చేసుకొంది. తిరుపతి లో ప్రొఫెసర్ ల వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ స్టూడెంట్  శిల్ప ఆత్మహత్య చేసుకొంది. మంత్రి నారాయణ కాలేజీలలో  కనీసం 50  మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇవేవి కూడా పవన్‌ కళ్యాణ్‌కు గత ఐదేళ్లలో కనిపించకపోవడం దురదృష్టకరం. ఏ ఒక్కరికి రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు.  బాబు హామీలకు నాది పూచి, నన్ను చూసి  ఓటేయండి  అని కాపు కాసి గెలిపించిన  పవన్ ఇంతమంది ఆత్మ హత్యలు చేసుకొంటే ఏనాడైనా డబ్బిచ్చాడా, బాబును విమర్శించాడా?. అల్లుడు నా కంటే గొప్ప  నటుడు అని ఆనాడే   ఎన్టీఆర్ చెప్పాడు. కాబట్టి తెలుగు డ్రామా పార్టీ అధ్యక్షుడు  బాబు, బిజినెస్ పార్టనర్ లు  పవన్ డ్రామాలాడుతూ   ప్రజలను మభ్యపెడుతున్నారని విజ్ఞులైన ప్రజలు గమనించాలి.

 

Read Also: వైయస్ఆర్ ఆశయం..సీఎం జగన్ లక్ష్యం పోలవరం

Back to Top