వైయస్ఆర్ ఆశయం..సీఎం జగన్ లక్ష్యం పోలవరం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు   

స్పిల్ వే ఎగువ ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభం

వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా సక్సెస్ 

అసలైన రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇదీ అనేలా వైయస్ జగన్ పాలన ఉంటోందని....నిజమైన విజన్ అంటే యువ ముఖ్యమంత్రిదని అంటోంది ఏపీ. వైయస్ ఆశయం, జగన్ లక్ష్యం పోలవరం పూర్తయ్యే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ పోలవరంలో భూమిపూజ చేసి శరవేగంగా పనులు మొదలుపెట్టింది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ విత్ డ్రా కాగానే శుక్రవారం పోలవరం స్పిల్ వే ఎగువ ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. వరదవల్ల దెబ్బతిన్న కట్టను కొత్తగా నిర్మించబోతున్నారు. అప్రోచ్ రోడ్లతో పాటు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుందని మేఘా చీఫ్ ఇంజనీర్ చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ద్వారా వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా సక్సెస్ అయ్యిందని నిరూపణ అయ్యింది. యువ ముఖ్యమంత్రి సమర్థత మరోసారి రుజువయ్యింది. పోలవరాన్ని సందర్శించినప్పుడు వైయస్ జగన్ చెప్పినట్టే నవంబర్ లో పనులు ఆరంభం అయ్యాయి. 
నిర్దేశిత లక్ష్యాలు
సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం...పోలవరానికి తొలి ప్రాధాన్యం ఇస్తామంటూ నవరత్నాల్లో ప్రకటించినట్టుగానే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి, ప్రాజెక్టులపై లోతైన సమీక్షలు చేసారు. రిజర్వాయిర్ల సామర్థ్యం పెంచడం, కాల్వల సామర్థ్యం పెంచడం, కొత్త డ్యామ్ ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు కూడా శరవేగంగా చేసారు. పోలవరం విషయంలో నాలుగు నెలల క్రితమే ఆడిట్ నిర్వహించారు ముఖ్యమంత్రి. పోలవరం  పనులు ఎంతవరకూ పూర్తి అయ్యాయో, ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణాల నాణ్యత ఎలా ఉందో, కాఫర్ డ్యాం, స్పిల్ వే ల నిర్మాణ ఎలా జరిగిందో అన్నీ కూలంకషంగా పరిశీలించారు. అప్పుడే పోలవరం నిర్మాణాన్ని 2021 జూన్ కల్లా పూర్తి చేయాలని, అది పూర్తయిన 10 నెలల్లోపే హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యాలను పక్కాగా నిర్దేశించుకున్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల నష్టపరిహారం గురించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ లక్ష్యాల మేరకే పని చేస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా 844 కోట్లు ఆదా చేసారు. 
బాబుకు చెంపపెట్టు
పోలవరం నిర్మాణం ఆపేసారంటూ ప్రచారం చేయబోయాడు చంద్రబాబు. నవయుగ ద్వారా పోలవరం పనులు ముందుకు కదలకుండా అడ్డుపడేందుకు నానా తిప్పలు పట్టాడు. కానీ హైకోర్టు బాబు నెత్తికి బొప్పికట్టేలా మొట్టికాయలేసింది. రివర్స్ టెండరింగ్ కు పచ్చజెండా ఊపింది. నవయుగతో టెండర్ రద్దు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ పీ జెన్‌ కోకి ఉందని స్పష్టం చేసింది. 
 

Read Also: సీఎం నిర్ణయంతో పామాయిల్‌ రైతుల హర్షం

Back to Top