రైతుల‌పై బాబు ఎన్నిక‌ల ప్రేమ‌

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొచ్చే కొద్దీ చంద్ర‌బాబులో అధికార కాంక్ష అన‌కొండ‌లా మారిపోతోంది. హామీల మీద హామీలు గుప్పిస్తూ, ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని అనుకుంటున్నాడు. కౌలురైతుల‌కు ఏటా 15000 అలాంటి మ‌రో హామీ. 2014లో రైతుల‌కిచ్చిన హామీల‌కే నేటికీ దిక్కులేదు. ఆర్భాటంగా ప్ర‌చారం చేసిన రైతురుణ‌మాఫీ అర‌కొర మాత్ర‌మే. నేటికీ నాలుగు ఐదో విడ‌త సొమ్ము విడుద‌ల చేయ‌లేదు. మైక్రో ఇరిగేష‌న్ అని చెప్పిన మాట ఏమైందో తెలియ‌దు. పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర అన్నాడు. ఇన్నేళ్ల‌లో అమ‌లుచేయ‌లేదు. పెట్టుబ‌డికీ, దిగుబ‌డికీ కూడా బీమా సౌక‌ర్యం అన్నాడు. పంట‌బీమాకే దిక్కులేని దుస్థితి ఉందిప్పుడు. వ్య‌వసాయాధారిత ప‌రిశ్ర‌మల ఏర్పాటు అన్నారు. కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులు అన్నాడు. ఉపాధి హామీ ప‌థ‌కం వ్య‌వ‌సాయంతో అనుసంధానం అన్నాడు. వ్య‌వ‌సాయ ప‌ర్యాట‌కం అభివృద్ధి అని ప్ర‌గ‌ల్బాల ప‌లికాడు. వీటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర‌లేదు. 

రుణ మాఫీ మోసం

అధికారంలోకి వ‌స్తే తొలిసంత‌కం రుణ‌మాఫీపై అన్నాడు చంద్ర‌బాబు. ఆ మొద‌టి హామీలోనే త‌న మోసం ప్ర‌ద‌ర్శించాడు. రుణ‌మాఫీకి క‌మిటీ ఏర్పాటు చేస్తూ దానిపై సంత‌కం పెట్టాడు. బేష‌రతురుణ‌మాఫీ అన్న‌ది కాస్తా బోలెడు లొసుగుల మాఫీ గా  త‌యారైంది. ష‌ర‌తుల‌తో కూడిన మాఫీలో ఎంతో మందికి రుణ‌మాఫీ వ‌ర్తించ‌లేదు. వ‌ర్తించినా విడ‌త‌ల‌వారీ మాఫీ వ‌ల్ల రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు స‌రిక‌దా, బాంకుల నుంచి వ‌డ్డీలు క‌ట్ట‌మ‌నే బ్యాంకు నోటీసులు అందుతున్నాయి. తాక‌ట్టు బంగారం చంద్ర‌న్న విడిపిస్తాడ‌ని ఊరూరా చాటింపు వేసిన చంద్ర‌బాబు ముఖం చాటేసాడ‌ని మ‌హిళ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు తీర‌ని మోసం చేసి, ప‌సుపు కుంక‌మ‌లంటూ క‌థ‌లు చెబుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాఫీ అంటే ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన‌ట్టు ఒకే సారి చేయాలి కానీ విడ‌త‌ల వారీగా కొంద‌రికే చేస్తుంటే, ఆ సొమ్ములు వ‌డ్డీకే చాల‌డం లేద‌ని, కోట్ల రూపాయిలు వృధా అయిపోతున్నాయ‌ని అంటున్నారు. చంద్ర‌బాబు లాంటి విజ‌న్, ఆర్థిక మంత్రులు చేసే గార‌డీలు తెలియ‌క‌పోయినా సామాన్యులు రుణ‌మాఫీ వెనక జ‌రుగుతున్న ద్రోహాన్ని క‌నిపెట్టారు. రుణ‌మాఫీ ద‌గా అని గొంతెత్తారు. నేడు రైతుల‌కు,  కౌలురైతుల‌కు 15,000 పెట్టుబ‌డి సాయం ఇస్తాన‌ని బాబు చెప్ప‌డాన్ని ఏ ఒక్క‌రూ విశ్వ‌సించ‌డం లేదు. రైతుల‌కు ఇచ్చిన ఏ హామీని అమ‌లు చేయ‌ని బాబు ఎన్నిక‌ల స్టంటుకు స్పంద‌న క‌రువైంది. 

రైతు బంధువుగా వైఎస్ జ‌గ‌న్

నాడు వైఎస్ ఎలా రైతును రాజు చేయాల‌ని ఆశించారో, నేడు ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ కూడా తండ్రి బాట‌లో రైతు మిత్ర‌గా నిరూపించుకుంటున్నారు. ద‌గాకోరు హామీలు కాదు, ద‌మ్మున్న హామీలు ఇస్తున్నారు. చెప్పిన‌వి చేయ‌క‌పోతే మ‌ళ్లీ ఓట్లేయ‌మ‌ని అడ‌గ‌ను అని చెబుతున్న నిజాయితీ ఇంకెక్క‌డ చూడ‌గ‌లం. రైతు అప్పుల ఊబిలో ప‌డ‌కుండా పెట్టుబ‌డికి సాయం చేస్తానంటున్నాడు యువ‌నేత వైఎస్ జ‌గ‌న్. ఇది ఓ యువ‌నాయ‌కుడి దూర‌దృష్టి. 50,000 రూపాయిల పంట పెట్టుబ‌డి అంటే రైతు వ్య‌వ‌సాయానికి సాగుబ‌డి. అప్పులు, వ‌డ్డీల విష‌వ‌ల‌యంలో చిక్కుకోకుండా సున్నావ‌డ్డీకే రైతుకు రుణాలు అందించే ఏర్పాట్లు అన్న‌దాత‌కు భ‌రోసానిస్తాయి. ఆరుగాలం క‌ష్ట‌ప‌డ్డా పంట‌కు స‌రైన ధ‌ర లేక‌పోతే రైతు క‌ష్టం మ‌ట్టిపాలే. అందుకే 3000 కోట్ల‌రూపాయిల‌తో ధ‌ర స్థిరీక‌ర‌ణ నిథి ఏర్పాటు చేసి ముందే మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించే విధానానికి శ్రీ‌కారం చుట్టారు వైఎస్ జ‌గ‌న్. అనుకోని విప‌త్తుల‌తో రైతు అత‌లాకుత‌లం అయితే ఆదుకునేందుకు స‌హాయ నిధిగా 2000 కోట్ల‌రూపాయిల విప‌త్తు స‌హాయ‌నిధి ఏర్పాటు. 9 గంట‌ల ఉచిత క‌రెంటుతో రైతుకు భ‌రోసా అందించ‌డం. కుల‌మ‌తాల‌కు, పార్టీల‌కు అతీతంగా ల‌బ్దిదారుల‌కు ప‌థ‌కాన్ని సంపూర్ణంగా అందేలా చేయ‌డ‌మే ల‌క్ష్యం. ఇది నిజ‌మైన విజ‌న్ అంటే. ఇదీ దార్శ‌నికుడైన నాయ‌కుడు చెప్పే మాట అంటే. పెట్టుబ‌డి భ‌రోసా, పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర భ‌రోసా, రైతుకు అప్పు పుడుతుంద‌నే భ‌రోసా...ఇవ‌న్నీ ఉన్న‌ప్పుడు రైతు రాజుకాక మ‌రేమౌతాడు. 

తాజా వీడియోలు

Back to Top