ఒకతిత్లీ... ఒకపెథాయ్... ఒక కేసీఆర్....

ఒక తిత్లీ...ఒక పెథాయ్...ఒక కేసీఆర్...ఇలా చెబితే అర్థం అయిపోతుంది కేసీఆర్ధాటి గురించి. గంటకు వందమైళ్లవైగంతో గాలులు వీస్తున్నాయి..అన్నట్టుగా సాగింది ప్రగతి భవన్లో కెసిఆర్ ప్రెస్ మీట్. తమ ప్రభుత్వం తెలంగాణా ప్రజలకు చేసిన అభివృద్ధి గురించి స్పష్టంగా చెబుతూనే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను చీల్చిచెండాడారు కేసీఆర్.

బాబు బండారం బట్టబయలు

కొన్నాళ్లక్రితం విజయవాడకు రాహుల్వస్తుంటే ఏముఖం పెట్టుకుని వస్తాడని అడిగిన చంద్రబాబు అదే రాహుల్తో చేయి కలిపాడు. మోదీ విజన్ఉన్న నాయకుడని పొగిడిన ఆనోటితోనే ఏపీకి ఏముఖం పెట్టుకుని వస్తాడని అడుగుతున్నాడు. అసలు బాబుకు ఏముఖం ఉందీ అంటూముఖంవాచే లాచీవాట్లు వేసారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. బ్లఫ్మాస్టర్లాబాబు ఊదుతున్నబుడగలను నిజాలనే సూదులతో బద్దలుచే సేసారు. ప్రపంచంలోఏదేశం చేయనట్టు, దేశంలో ఏరాష్ట్రం చేయనట్టూఅభివృద్ధి జరిగిపోయిందని శ్వేతపత్రాలు విడుదల చేస్తూ మరోపక్కలోటు బడ్జెట్, నిధులులేవు, పేద రాష్ట్రం అంటూ బీదఏడుపులుఏడ్వటమేంటని ముక్కుసూటిగా ప్రశ్నించారు. దేశంలోనేడర్టీ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబే అని కుండబద్దలు కొట్టేశారు కేసీఆర్.

అబద్ధాల రాజకీయం మంచిది కాదన్నకేసీఆర్

చంద్రబాబు లాంటి అబద్ధాలకోరు, దగాకోరు, మోసగాడిని భరిస్తున్నందకు ఆంధ్రప్రదేశ్ప్రజలను చూస్తుంటే జాలేస్తోందని అన్నారు కేసీఆర్. ఇలాంటి పచ్చి అవకాశవాది, మోసకారి ఉండటం ఏ రాష్ట్ర ప్రజలకైనా ప్రమాదకరమే అని హెచ్చరించారు. తెలంగాణా ప్రజలు అది తెలుసుకునేబాబును తరిమికొట్టారని, ఆంధ్రాప్రజలుఅందుకే అభినందనలు చెప్పారని అన్నారు.

మీ హోదాకు మా మద్దతు అన్న టిఆర్ఎస్  అధినేత

ఏపీకి ప్రత్యేకహోదా కేసీఆర్వద్దంటున్నాడని ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు...అది ఉత్త అబద్ధం అన్నారు తెరాసాఅధినేత. లోక్సభలోనూ, రాజ్యసభలోనూ మాఏంపీలు కూడా ఏపీకి ప్రత్యేకహోదా కావాలనే చెప్పారన్న విషయం రికార్డు అయి ఉన్నదని చెప్పారు కేసీఆర్. కావాలంటే  ఏపీకి ప్రత్యేకహోదా  ఇవ‌్వమని కోరుతూ నేనే ప్రధానికి లేఖ రాస్తాను అన్నారు.  సెక్షన్94 లో1 మరియు2లో పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు రెండు రాష్ట్రాలకూ ఇవ్వాలని ఉంది. అలా ఇస్తూనే ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మనే మేమూ చెబుతున్నామన్నారు కేసీఆర్. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోకూడదనే, ఆదాయంలో లోటు వల్ల వెనుకబడకూడదనే ఉద్దేశ్యంతోనే రెవెన్యూ డెఫ్ షీటు కవర్  చేసేలా 24000 కోట్లను కేంద్రం అందిస్తోంది. అంటే తక్కువ పడుతున్నఆదాయాన్నికేంద్రం ఏపీకి సర్దుబాటు చేస్తోంది. మరి అలాంటప్పుడు రెవెన్యూ డెఫ్ షీటు  ఎలా ఉంది అన్నది చంద్రబాబు చె ప్పాలని అడిగారు కేసీఆర్. సమృద్ధిగా నిధులు, రెవెన్యూలోటును పూడ్చేలా  ఫైనాన్సు కమిషన్  సిఫార్సు చేసినా డబ్బులు ఉన్నాకూడా రాష్ట్రం అధఃపాతాళంలో పడిందంటే కేవలం చంద్రబాబు అవినీతి, అక్రమాలు, అశక్తత, అసమర్థతవల్లే అని తేల్చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి.

బాబు లీడర్కాదు మేనేజర్

పార్టీ పెట్టి ఇద్దరు ఎంపీలతో కలిసి తెలంగాణారాష్ట్రాన్నిమేముతెచ్చుకుంటే, మామ పెట్టినపార్టీని గుంజుకుని, మామకువెన్నుపోటుపొడిచిఉన్నపార్టీనిమేనేజ్చేస్తున్నమేనేజర్చంద్రబాబు అన్నారు కేసీఆర్. స్వశక్తితో ఎదగడంబాబుకు ఎప్పుడూ తెలియదని విమర్శించారు. నిజమేమరి ఓసారివెన్నుపోటు, మరోసారిజాతీయ పార్టీలతోపొత్తు, ఇంకోసారి కులసమీకరణం, వర్గాధిపత్యంతో రాజకీయాలు చేయడం తప్పబాబు స్వయం ప్రకాశితనేతగా ఎదిగింది లేదు. బాబు రాజకీయ చరిత్ర మొత్తం పరాన్నభుక‌్కులాంటిదే.  

డబ్బారాయుడి డప్పులు నమ్మొద్దు

డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో  భాగంగా హైదారాబాద్ లో   ఐటికి పునాదులు పడ్డాయన్నారు కేసీఆర్. రాజీవ్ గాంధీ హయాంలో  నేదురుమల్లి  జనార్థనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపనతో  సైబర్ టవర్సు కు పునాది  పడిందన్న వాస్తవం ప్రజలకు తెలియనీయ కుండా అంతా చంద్రబాబే చేసాడని బాకా పత్రికలు రెండూ ప్రచారం చేసాయన్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన వాస్తవాలను పత్రికా ముఖంగా బయటపెట్టారు. ప్రజలకు నిజాలు తెలియాలని, బాబు ఏమీచేయక పోయినా రంగురంగుల్లో ఏదో చేసేసాడని భ్రమపెట్టడమే ఇప్పటిదాకా జరిగిందన్నారు. బాబు తెలివిఅంతా డొల్లే అన్నారు.  తెలంగాణాలో అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథాకాన్ని కాపీకొట్టి అందులోని తప్పుగా పడ్డప దాన్ని కూడా యధాతథంగా ఉంచేసిన కాపీమాస్టర్  అంటూ విమర్శించారు కేసీఆర్.

ప్రగతి భవన్ లో  గంటకుపైగా సాగిన  పత్రికా   తెలంగాణా ముఖ్యమంత్రి మాటల ఉధృతి చూస్తే బాబుకు రిటర్ను గిఫ్టు  ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది.   

Back to Top