మళ్లీ అవే ‘సంక్రాంతి’ సరుకులు

పుచ్చిపోయిన పప్పు, బూజు పట్టిన బెల్లం పంపిణీ

అన్నింటా తూకాల్లో భారీ తేడాలు

హెరిటేజ్‌కు లాభం చేకూర్చడమే బాబు వ్యూహం

రేషన్‌ ఎగ్గొట్టి ‘కానుకలతో’ మాయ చేసే కుట్ర

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి.. ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకలు. గడిచిన నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల నాణ్యత తీరిది. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు.. సంక్రాంతి పండక్కి చంద్రన్న కానుకల పేరుతో ఐస్‌ చేసే ప్రయత్నం చేసినా ఏనాడూ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ తూకాల మోసాలు కూడా షరా మామూలే. వైయస్‌ఆర్‌ హయాంలో రూ.187లకే 9 రకాల సరుకులు రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తే.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే క్రమేణా మంగళం పాడేశాడు. కొన్నాళ్లపాటు కేవలం రేషన్‌ బియ్యం మాత్రమే పంపిణీ చేసినా.. టెక్నాలజీ పేరు చెప్పి లబ్ధిదారులకు విసుగు పుట్టించాడు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈపోస్‌ విధానంతో రేషన్‌ తీసుకోవాలంటే లబ్ధిదారులు బెంబేలెత్తిపోయారు.

గ్రామాల్లో ఈపోస్‌ మెషీన్లకు సిగ్నళ్లు అందక గంటల కొద్దీ క్యూలైనల్లలో నిలబడాల్సి వచ్చేది. రేషన్‌ తీసుకునేందుకు లబ్ధిదారులు కూలీ పనులు మానుకుని రోజంతా నిరీక్షించాల్సి వచ్చేది. ఇలా రోజుల తరబడి కూలీ నాలీ చేసుకునేవారంతా పనులు మానుకుని నష్టపోయేవారు. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు విసుగుపుట్టించి రేషన్‌ అంటేనే చిరాకు పుట్టేలా చేశారు. చివరకు లబ్ధిదారులను ఒక్కొక్కరిగా రేషన్‌ షాపులకు దూరం చేశారు. చివరికి ఎవరూ రేషన్‌ తీసుకోవడం లేదనే నెపం చూపించి రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మొత్తానికే ఎగనామం పెట్టేశారు. కానీ ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌ సమాయాల్లో మాత్రం నాలుగైదు రకాల సరుకులు పంపిణీ చేస్తున్నాడు.

అది కూడా తెలంగాణలో కేసీఆర్‌ పంపిణీ చేయడం చూసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రాలోనూ సరుకులను పంపిణీ చేయడం మొదలు పెట్టాడు. అందులోనూ పబ్లిసిటీ కోసం చంద్రన్న కానుక అని పేరు పెట్టుకుని మరీ పంచుతున్న సరుకుల్లో నాణ్యతకు మాత్రం తిలోదకాలిచ్చారు. పుచ్చిపోయిన కంది పప్పు, పాచిపోయి బూజు పట్టిన బెల్లం, కంపు కొడుతున్న నెయ్యి, ఏళ్ల నాడు మిగిలిపోయిన శనగలు, కాలం చెల్లిన గోధుమ పిండి పంచారు. సంక్షోభాలను అవకాశాలను మలుచుకోవాలని చెప్పే చంద్రబాబు ఇక్కడా తన స్వలాభం కోసం హె రిటేజ్‌ నెయ్యిని పంపిణీ చేసి తన కంపెనీకి లాభాలు చేకూర్చే ప్రయత్నం తప్ప.. పండగ కానుక అందజేయాలని ఉద్దేశ్యం ఏమాత్రం లేదనేది సుస్పష్టం. 

Back to Top