ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు `జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌`

నేడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ
 

 తాడేపలి:  పెద్ద చ‌దువులు చ‌ద‌వాడినికి, పెద్ద స్థాయికి ఎద‌గ‌డానికి ఎవ‌రికీ పేద‌రికం అడ్డు కాకూడ‌దన్న‌దే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్యం. పేద‌రికంలో ఉన్న ప్ర‌తి పిల్ల‌వానికి ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు జ‌గ‌న‌న్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ చెల్లిస్తున్నారు. అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.709 కోట్ల బుధవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తుంది.

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 9,274 కోట్లను అందజేసింది. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లను కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే చెల్లించింది.

10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు
 జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌–డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేయనున్నారు.

►జగనన్న విద్యా దీవెన.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే పథకం. 
►ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
►జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు  వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 9,274 కోట్లు.
►టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు వైయ‌స్ జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది.  

తాజా వీడియోలు

Back to Top