మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి

వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గిస్తున్న టీడీపీ

ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు మొబైల్ నుంచి ఒక్క మెసేజ్ చాలు

www.nvsp.in వెబ్‌సైట్‌లో కూడా నిర్ధారించుకోవ‌చ్చు

నేటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం

అమ‌రావ‌తి: ఓటు ఉందా? లేదా?.. కొత్త ఓటు నమోదు కోసం నిర్వహించిన 'మీ ఓటును చెక్‌ చేసుకోండి. ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు భవిష్యత్తులో తమకి  ఓటు అడ్డు వస్తుందని అనుకునే వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల ఓట్ల‌ను జాబితాలో నుంచి తీసేస్తున్నారు. ఇది గ‌త కొంత కాలంగా ఏపీలో జ‌రుగుతున్న తంతే..అయితే మనం ఓటు వేయాలని అనుకోవడం.. వేయడం మనకు రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కు. ఆ హక్కుని ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తులు అయినా సరే కాలరాయాలని అనుకోవడం రాజ్యంగ‌ ఉల్లంఘన క్రిందకే వస్తుంది. అయితే కొన్ని కారణాలు చూపించో మరే ఇతర మార్గాల ద్వారానో ఓట్లని తీసేస్తూ ఉంటారు..ఈ విష‌యంపై ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు, గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

మీ ఓటు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి..
ముఖ్యంగా యువకుల ఓట్లని  టీడీపీ తప్పిస్తోంది. .ఏపీలో  అధికార టీడీపీ ఇప్పటి వరకూ 60 లక్షల పై చీలుకు ఓట్లని తొలగించింది.   అందుకే ప్రతీ ఒక్కరూ ఈ- సేవా సెంటర్స్ కి వెళ్లి ఓట‌ర్ జాబితాలో  మీ పేరు ఉందా లేదా చూసుకుని లేకపోతే మళ్ళీ నమోదు చేసుకోవాలి. ఇంకొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. తుది ఓటర్ జాబితా కూడా విడుదలవుతుంది. అయితే అంతలోపే మీరు మీ ఓటును చెక్ చేసుకుంటే ఓటు లేకపోయినా, ఏవైనా తప్పులు ఉన్నా సరిదిద్దుకోవచ్చు. మరి మీ ఓటు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
 
ఓటు ఉందో?  లేదో నిర్ధారించుకోవ‌చ్చు..
1. మీ ఓటు చెక్ చేసుకోవడానికి మీరు www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. (National Voters’ Service portal)
2. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. (National Voters’ Service portal)
3. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. (National Voters’ Service portal)
4. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. (National Voters’ Service portal)
5. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే. ( Wikimedia Commons)
6. ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. (National Voters’ Service portal)

తాజా వీడియోలు

Back to Top