తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్‌కు వివరించారు.