బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే

డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

అద్దంకి: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ను అద్దంకి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు మోపి బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ప్రజల తరఫున పోరాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను భయపెట్టేందుకు, వేధించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

బొల్లా బ్రహ్మనాయుడిపై నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Back to Top