బాబును కాపాడే ప‌నిలో కేంద్రం

కౌంట‌ర్ తో రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం

ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టే విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం  ఒక్క అడుగు కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. పీపీల‌ను పునఃస‌మీక్షించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్రం తోసిపుచ్చ‌డాన్ని సీరియ‌స్ గా తీసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం. చంద్ర‌బాబు చేసిన అక్ర‌మ ఒప్పందాల‌ను కేంద్రం ఇప్పుడెందుకు వెన‌కేసుకొస్తోందంటూ ఘాటుగా ప్ర‌శ్నిస్తున్న‌ది కూడా. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి, ఏకంగా కేంద్ర మంత్రి కూడా విద్యుత్ ఒప్పందాల విష‌యంలో ఎందుకు బాబు ప‌క్షం వ‌హిస్తున్నార‌ని నిల‌దీస్తోంది.2.70 ధ‌క్ఎ 5000 మెగా వాట్లు అందించేదుకు కంపెనీలు రెడీగా ఉండ‌గా పెట్టుబ‌డులు రావ‌న్న భ‌యమెందుకు అని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫును కేంద్ర మంత్రికే కౌంట‌ర్ ఇచ్చారు అజ‌య్ క‌ల్లం. టెండ‌ర్లే లేకుండా ఒప్పందాలు కుదిరిన చోట పెద్ద ఎత్తున ముడుపులు ముట్టిన‌ట్టు అర్థం కావ‌డం లేదా అని రాష్ట్రం కేంద్రాన్ని దులిపేసింది. 

బాబు మెడ‌కు విద్యుత్ కొనుగోళ్ల ఉచ్చు బిగుసుకోకుండా కేంద్రం ఎందుకు అడ్డుప‌డుతున్న‌ట్టు? ఏ శ‌క్తులు కొత్త‌గా కేంద్ర స‌ర్కార్ ను ఈ దిశ‌గా ఒత్తిడి చేస్తున్నాయి. అవినీతి ప‌రుల అంతం మా పంతం అన్న మోదీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు అంత అవినీతి ప‌రుడు దేశంలోనే లేడు అని చెప్పిన కాషాయి ప్ర‌భుత్వం నేడు అదే చంద్ర‌బాబు అవినీతి భాగోతాల‌ను వెలికితీయ‌కుండా ఎందుకు అడ్డుప‌డుతోంది? కేంద్రంలో కొంద‌రు ఉన్న‌త స్థాయి అధికారులు ప‌క్కా చంద్ర‌బాబు అనుచ‌ర వ‌ర్గం అని గ‌తంలోనే తేలింది. చాలా విష‌యాలు టీడీపీకి లీకులు ఇచ్చి బాబును కాపాడే పెద్ద‌లు అక్క‌డున్నారు. వారే చంద్ర‌బాబ‌పై విద్యుత్ కొనుగోళ్ల అక్ర‌మాల విష‌యంలో స‌మీక్ష‌లు జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటున్నారన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. చంద్ర‌బాబు అక్ర‌మాలు వెలికితీసి ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం ఖాయం అంటూ ఓ ప‌క్క బీజేపీ నేత‌లే చెబుతున్న త‌రుణంలో అందుకు విరుద్ధంగా బాబును కాపాడే శ‌క్తులు కూడా త‌మ పావులు క‌దుపుతున్నాయి. 

ఏదేమైనా అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ కొని రాష్ట్రంపై భారం మోప‌లేమంటున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్. కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి మార్కెట్ రేటు ప్ర‌కారం త‌క్కువ‌కే అంటే చౌక‌ధ‌ర‌కే విద్యుత్ ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అందుకోసం అవ‌స‌ర‌మైతే గ‌త ఒప్పందాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఖ‌రాఖండీగా చెప్పారు. 

విద్యుత్ కొనుగోళ్ల‌పై స‌మీక్ష‌లు, కేంద్రం మోకాలు అడ్డ‌టం, దానిపై రాష్ట్రం సీరియ‌స్ కావ‌డం ఇవ‌న్నీ ఓ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అవ‌స‌ర‌మైతే కేంద్రంతో పోరాటానికి కూడా వెనుకాడ‌రు అని. చంద్ర‌బాబులా మోదీ ముందు మోక‌రిల్లే స‌మ‌స్యే లేద‌ని.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీతో క‌లిసి  ప‌ని చేస్తున్నార‌ని పిచ్చి ప్రేలాప‌న‌లు పేలే వారికి విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వ వైఖ‌రి మింగ‌లేని వెల‌క్కాయిలా త‌యారైంది. చంద్ర‌బాబును వెన‌కేసుకొస్తే కేంద్రాన్ని కూడా స‌హించేదిలేద‌నే విష‌యాన్ని రాష్ట్రం క‌ట్ త్రూట్ గా వెల్ల‌డిస్తోంది. బాబు అక్ర‌మాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. ఇప్ప‌టికే నాడు బాబు క‌ట్టిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చి త‌మ వైఖ‌రి తెలియ‌జేసిన ప్ర‌భుత్వం, విద్యుత్ కొనుగోళ్ల‌లో అవినీతిని కూడా తేల్చేదాకా, ఖ‌జానాకు జ‌రిగిన న‌ష్టాన్ని రిక‌వ‌రీ చేసేదాకా వ‌దిలిపెట్ట‌దు. 

Back to Top