అన్నీ సక్రమమే అంటున్న ట్రిబ్యునల్

 వైయ‌స్‌ జగన్ పై విష ప్రచారం  చేసిన నోళ్లకు తాళాలు

 వైయ‌స్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని తేల్చిన ట్రిబ్యునల్  

వైయ‌స్‌ జగన్ పై ఉద్దేశపూర్వక అభియోగాలు

అడ్డగోలుగా పెట్టిన కేసులు వీగిపోతున్నాయి. ఆరోపణలతోనే జగన్ పై విష ప్రచారం  చేసిన నోళ్లకు తాళాలు పడుతున్నాయి. నిజాలు నిగ్గుతేలుతున్నాయి. వైఎస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. అసలు ఈడీ ఇన్విస్టిగేషన్ తీరునే తప్పుబట్టింది ట్రిబ్యునల్. నిబంధనలు ఉల్లంఘిస్తూ భూ కేటాయింపులు జరగలేదని కూడా ప్రకటించింది. 
వైఎస్‌జే కి చెందిన జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో పెట్టుబడులు పెట్టిన పెన్నా, పయనీర్ ఇన్‌ఫ్రా హోల్డింగ్ కంపెనీల ఆస్తులను 2015లో ఈడీ అటాచ్ చేసింది. పెన్నా సిమెంట్స్ కు భూ బదలాయింపులకు బదులుగా క్విడ్ ప్రోకో పద్ధతిలో జగన్ కంపెనీల్లో ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నది ఈడీ ఆరోపణ. కానీ దీనికి సంబంధించి సరైన ఆధారాలే లేవని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. 7.5 కోట్ల లబ్ది కోసం 53 కోట్లు ఇచ్చారనడం అసలు వాస్తవదూరంగా ఉందని చెప్పింది. భూ కేటాయింపుల్లో అక్రమాలే జరిగి ఉంటే ఒక్క రైతన్నా ఫిర్యాదు చేయకుండా ఉంటారా అని ఈడీని ప్రశ్నించింది. తమ పెట్టుబడులను మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో గా పరిగణించి, ఆస్తులు జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ పెన్నా, పయనీర్ సంస్థలు అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేసాయి. దీనిపై నాలుగేళ్లుగా విచారణ సాగుతోంది. సీబీఐ ఆరోపణల ఆధారంగా ఈ కేసులు పెట్టినట్టు కనిపిస్తోందని, జగన్ పై ఉద్దేశపూర్వక అభియోగాలుగానే ఈ కేసులు కనిపిస్తున్నాయని కూడా ట్రిబ్యునల్ వాఖ్యానించింది. ఆరోపణల ఆధారంగా ఆస్తులను ఎటాచ్ చేయకూడదని స్పష్టం చేసింది. 
ముడుపులా, పెట్టుబడులా అన్నది కనీసం నిర్థారించుకోకుండానే ఈడీ ఆస్తులను అటాచ్ చేయడాన్ని ట్రిబ్యునల్ తప్పు పట్టింది. అసలు ఈడీ ఈ కేసులను విచారణ చేస్తున్న తీరే తప్పుగా ఉందని వాఖ్యానించింది. ఈ రెండు సంస్థలనుంచీ అటాచ్ చేసిన భూములను వెంటనే ఈడీ రిలీజ్ చేయాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కావాలంటే కొంత మొత్తాన్ని డిపాజిట్ గా తీసుకోవచ్చని తెలియజేసింది. 
రాజకీయ కక్ష సాంధింపుల్లో భాగంగా వైఎస్ జగన్ పై నిరాధారమైన కేసులు బనాయించారని, ఉద్దేశపూర్వకంగానే జగన్ పై విష ప్రచారం సాగించారని తాజా తీర్పుల వల్ల తేటతెల్లం అవుతోంది. త్వరలో అన్ని ఆరోపణలకూ న్యాయస్థానం ద్వారానే సమాధానం వస్తుంది. ఇప్పటికే ప్రజా కోర్టులో వైఎస్ జగన్ నిర్దోషిగా, నిజాయితీగల నేతగా తీర్పు సంపాదించుకున్నారు. ఇక అత్యున్నత న్యాయస్థానంలో చట్టబద్ధంగా అది నిరూపణ కావడమే మిగిలి ఉంది. 
 

Back to Top