భోగాపురంలో చంద్రబాబు భూప్రతాపం..!

భూదందాకు నోటిఫికేషన్..!
ప్రభుత్వ తీరుతో యువరైతు బలి..!
విజయనగరంః భూముల పేరుతో  పచ్చప్రభుత్వం ప్రజలను పీల్చిపిప్పిచేస్తోంది. చంద్రబాబు రైతన్నల పాలిట యమపాశంలా తయారయ్యాడు. చంద్రబాబు భూదాహానికి రైతుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. భూములను అప్పనంగా దోచుకుంటుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాజధాని, పరిశ్రమలు, ఎయిర్ పోర్టుల పేరుతో లక్షలాది ఎకరాలను మింగేస్తూ టీడీపీ నేతలు అన్నదాతలకు కొరకరాని కొయ్యగా మారారు. 

భోగాపురంలో భూదందా..రైతు మృతి
విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుకోసం 5000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. ఈక్రమంలోనే ఇవాళ అధికారులు విమానాశ్రయం కోసం  నోటీసులు జారీ చేస్తున్నారు. తన భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో మనస్తాపం చెందిన ఓయువ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. 

ప్రాణం తీసిన భూమాంత్రికుడు..!
భోగాపురం మండలం, వెంపాడుపేటకు చెందిన సూరి ప్రభుత్వ తీరుతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. పొలం చేజారుతుందన్న భయంతో ఈఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. ప్రభుత్వం కారణంగానే సూరి మృతిచెందాడని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములివ్వబోమని రైతులు చెప్పినప్పటికీ ప్రభుత్వం మొండిపట్టువీడడం లేదు.  తొందరపాటు నిర్ణయం వల్ల రైతులు బలైపోతున్నా పచ్చనేతలకు ఏమాత్రం పట్టడం లేదు. భూముల పేరుతో పేదప్రజల పొట్టగొట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలు, ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 
Back to Top