ఢిల్లీఃపార్లమెంటు ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకహోదా గళాన్ని వినిపించారు. వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.చంద్రబాబుకు విలువలు లేవని..మిడిల్ మోదీ,జూనియర్ మోదీ అంటూ కేసీఆర్,జగన్‌లను చంద్రబాబు వర్ణించడం పట్ల ఫైర్ అయ్యారు.నాలుగు సంవత్సరాలు చంద్రబాబు మోదీతో చేసింది కాపురమా..వ్యభిచారమా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు లక్షల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు డబ్బంతా కక్కిస్తామన్నారు. డిసెంబర్‌కల్లా ఏపీలో అమరాతిలో హైకోర్టు భవనం పూర్తిచేస్తామని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారన్నారు. ఆ అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో హైకోర్టును స్థాపించారన్నారు.ఎవరైనా హైకోర్టు వస్తుందంటే సంతోషపడతారు.కాని చంద్రబాబు వంటి దుర్మార్గ ముఖ్యమంత్రి హైకోర్టు వస్తుందంటే విమర్శలు గుప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జగన్ కోసం హైకోర్టును విభజించారని చెప్పడం దారుణమన్నారు. హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కరణ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోస కేసీఆర్ మద్దతు స్వాగతిస్తున్నామన్నారు.