చేనేత కోసం సర్కార్ పై యుద్ధం

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసాడు చంద్రబాబు. వారిలో చేనేతలు కూడా ఉన్నారు. ఏళ్లకు ఏళ్లుగా చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వ సహాయం అందక, వారికి రావాల్సిన బకాయిలూ రాక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. నేతన్నలను ఈ నరకం నుంచి దూరం చేయాలనే సంకల్పంతో గత నెల రోజులుగా వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 17న ధర్మవరానికి వచ్చి నేతకార్మికుల దీక్షలకు మద్దతు పలకనున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి. చేనేతలపై చంద్రబాబు తీరుని ప్రశ్నించేందుకు, ప్రభుత్వం మెడలు వంచైనా చేనేతలకు సాయం అందించేందుకు గర్జించనున్నారు.  హోదాకోసం అనంత యువభేరిలో గర్జించిన వైయస్ జగన్ మళ్లీ నేతన్నలకు అండగా నిలబడేందుకు మరోసారి జిల్లాకు విచ్చేస్తున్నారు. 

మద్దతు ధర లేక, ముడి సరుకుల ధరలు పెరిగి అతలాకుతులం అవుతున్న నేతన్నలకు పన్నుపోటు మరో భారమైంది. కోట్ల రూపాయిల సరుకు జిఎస్ టి దెబ్బకు నిలిచిపోయింది. కష్టపడి నేసిన లక్షల చేనేత వస్త్రాలు సొసైటీల్లో మగ్గిపోతున్నాయి. పండగల్లోనూ ఆప్కో ఈ సరుకును తీసుకోకపోవడంతో నేతన్నలకు పూట గడవడం కష్టం అయిపోతోంది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం చేనేతల పథకాలకు తూట్లు పొడిచింది. వారిని ఆదుకునేందుకు ఒక్క పథకాన్నీ సవ్యంగా అమలు చేయడం లేదు. పాత బకాయిలు రాక, రాయితీలు అందక నేతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. రంగుల చీరలను నేసే నేతల బతుకులు వెలిసిపోవడానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబు అవకాశవాదమే అంటున్నారు చేనేతలు. 

చేనేతకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. 
చేనేత, పవర్ లూమ్స్ ఉన్నవారికి రుణాల మాఫీ అరకొరగానే జరిగింది. చేనేతల కుంటుంబాలకు ఇస్తానన్న లక్ష రుణం ఎవ్వరికీ అందిందే లేదు. ఇంత వరకూ 13జిల్లాల్లో ఎక్కడా చేనేత పార్కులే లేవు. నేతన్నలకు శిక్షణ ప్రోత్సాహకాలు ఇస్తామన్న బాబు చేనేత సహకార సంఘాలకు బకాయిలే పూర్తిగా చెల్లించలేదు. చేనేతలకు, ఇళ్లు మగ్గం షెడ్లు అన్నమాట మట్టిలో కలిసిపోయింది. సగం ధరకే జనతా వస్త్రాలు హామీ గాల్లో కలిసిపోయింది. చేనేతకు 30% రిబేటు ఇస్తానని చెప్పిన బాబు ఆ మాటే మర్చిపోయాడు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ స్కీం టిడిపి నేతల మధ్య ఉన్న కమిషన్ల వ్యవహారంతో అటకెక్కింది. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ఈ పథకం ధర్మవరంలో గత రెండేళ్లుగా అమలు కావడం లేదు.

నేతన్నలకు అండగా ప్రతిపక్ష నేత
చేనేతకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మునుపు రెండు రోజుల దీక్ష చేపట్టారు. 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా దీక్షలో పాల్గొని నేతన్నలకు గిట్టుబాటు ధర కావాలని, వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలనీ ప్రభుత్వంపై పోరాడారు. అదే పోరాట పంథాని ముందుకు తీసుకు వెళ్తూ వైయస్సార్ సిపి నాయకులు గత నెల రోజులుగా ధర్మవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాని ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి కొన్ని నెలల బకాయిలను చేనేతలకు ముట్టజెప్పింది. అయితే పూర్తి స్థాయిలో బకాయిలను చెల్లించేవరకూ దీక్షలు కొనసాగుతాయన్నారు వైయస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. జిఎస్ టి నుంచి చేనేతకు మినహాయింపు, ముడిసరుకులపై రాయితీ  పెంపు, చేనేతకు పెద్ద ఎత్తున మార్కెటింగ్ విధానాలతో వారిని ఆదుకోవాలని ఈ సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత జీవితాలకు భరోసా కల్పిస్తామని, తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని ఇంతకు ముందు చేనేత కార్మికులను కలిసిన సందర్బంలో వైయస్ జగన్ చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top