అధినేత..అందరి బంధువు

  • పార్టీ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్న వైయస్‌ జగన్‌
  • అందరిని ఏకతాటిపై తెస్తున్న వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
  • కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న జననేత
  • యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్న ప్రతిపక్ష నేత
  • ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చిన అండగా నిలుస్తున్న వైయస్‌ జగన్‌ 
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  ఎప్పు డూ ఒకమాట చెబుతుండేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని అనేవారు. ఇదే సిద్ధాంతాన్ని మహానేత తనయుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాటిస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలని ప్రజలంతా గర్వంగా చెప్పుకునేలా వైయస్‌ జగన్‌ బతుకుతున్నారు. ఓ రాజకీయ పార్టీని నడపడం అంటే అంత అషామాషి పని కాదు. పార్టీలో రకరకాల నాయకులు, విభిన్నమైన కార్యకర్తలు ఉంటారు. అందర్ని ఒక తాటిపైకి తీసుకురావడం, ప్రతి ఒక్కర్ని సంతృప్తి పరచడం అధినేతకు చాలా కష్టం. అయితే అధినేత అన్నవాడు అందరికి ఆదర్శంగా ఉండాలని వైయస్‌ జగన్‌ చేసి చూపుతున్నారు. తన తండ్రి దివంగత నేత వైయస్‌ఆర్‌ లాగే అందర్ని కలుపుకొనిపోతున్నారు. ఇరువర్గాల నేతలను కూర్చోబెట్టి సమాధానపరుస్తున్నాడు. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా క్షణాల్లో వాలిపోతున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడినా, అనారోగ్యంతో బాధపడుతున్నా..అకాల మరణాలతో పార్టీ నేతలు కన్నుమూసిన సమయంలో కుటుంబ సభ్యులను ఓదార్చుతూ..అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇందుకు తాజా ఉదాహరణగా నిన్నటి రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సంఘటనలే సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు.

అండా దండా అధినేతే
క్షేత్రస్థాయి సామన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధి దాకా అందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండా దండగా నిలుస్తున్నారు. ప్రజలకు ఏ కష్టమెచ్చినా..నాయకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన వెంటనే వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని నిడమనూరు గ్రామ సర్పంచ్‌ కోటేశ్వరావు కారును టీడీపీ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ స్వయంగా గ్రామానికి వెళ్లి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి తరువాత స్థాయి ఉన్న వ్యక్తి ఇలా సర్పంచ్‌ను పరామర్శించడం రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న నందిగామ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రమీలారాణిని, పార్టీ నేత సామినేని ఉదయభాను తండ్రి విశ్వనాథ్‌ను ఆసుపత్రిలో పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అందరూ ఆయన కుటుంబ సభ్యులే
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులే. తనకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెబుతుంటారు. జననేత ఎక్కడికి వెళ్లినా సరే ముందుగా మీరంతా నా కుటుంబ సభ్యులంటూ సంబోధించడమే కాదు. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెలికి అంటూ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇదే మాదిరిగా పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన వ్యవహరిస్తారు. తాను అధినేతను కదా అన్న ధోరణి కాకుండా వయసులో పెద్దవారిని అన్నా..అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఇటీవల పార్టీలో చేరిన తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు అన్నను తన కుటుంబ సభ్యుడిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే నిన్న నరసరావుపేట పట్టణంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డిని తన తమ్ముడు అంటూ సంబోధిస్తూ..అన్నగా తోడుంటానని భరోసా కల్పించారు. మహేష్ రాక వల్ల నరసరావుపేటలో గందర గోళం నెలకొంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆనందంగా ఎదురు చూస్తున్నారమో! ఎలాంటి గందరగోళం ఉండదని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. కారణం ఏమిటంటే.. మహేష్ ను చేర్చుకునే ముందు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తితో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.. ప్రజలను అడుగడుగునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని జంగా కృష్ణమూర్తితో చెప్పారు. తర్వాత ఇద్దరు కలసికట్టుగా ఆలోచన చేశారు. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. క్లబ్బుల దగ్గర్నుంచి మైన్‌ల దాకా.. ఇసుక దగ్గర్నుంచి చివరకు సినిమా థియేటర్ల దాకా అంతటా అరాచకమే. అక్కడ రౌడీయి జమే రాజ్యమేలుతోంది. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి యువకుడు, ఉత్సా హవంతుడు అయిన మహేష్ రెడ్డిని తీసుకొద్దామని చెప్పారు. గురజాల నియోజకవర్గంలో నిలబడుతున్న నా తమ్ముడు మహేశ్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. నరసరావు పేట నియోజకవర్గంలో అందరికీ పరిచయస్తు డు, డాక్టరు, సౌమ్యుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డినే  కొనసాగుతారని అధినేత స్పష్టత ఇచ్చారు. నాన్న వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్లు నాకు నాన్నగా అండగా నిలిచారని నిన్న నరసరావుపేటలో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదని గట్టిగా చెబుతున్నా అని భరోసా ఇచ్చారు. నేను ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలకే జంగన్నను చట్టసభల్లోకి తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానని సభా ముఖంగా చెబుతున్నా’’ అని వైయస్‌ జగన్‌ అన్నారు. 

బాబును చూస్తే తలదించుకోవాలి
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను మోసం చేసిన వాడు తమ నాయకుడని ప్రజలు సిగ్గుతో తలదించుకొనే విధంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు  ఎన్నో హామీలిచ్చారు. రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు వచ్చారు.. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు.. నోటీసులు మాత్రం వచ్చాయి. రుణమాఫీ చేయకుండా రైతులను దగా చేశారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా  అక్కచెల్లెమ్మలను  వంచించారు. మోసం చేయకుండా సమాజంలోని ఏ వర్గాన్నీ వదల్లేదు. బాబొస్తే జాబొస్తుందంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు.  అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే వాడు నాయకుడు కాడు. అబద్ధాలు చెప్పి, మోసం చేసే ముఖ్యమంత్రి వద్దని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నాకు తోడు నిలవండి..అండగా ఉంటానని చెప్పే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.   
 
Back to Top