కృత్రిమ దీక్షలతో టీడీపీ అలుపెరుగని పోరాటం

– రైల్వే జోన్‌ పేరుతో దొంగ దీక్షలు

– నాడు వైయస్‌ఆర్‌సీపీ దీక్షలు చేస్తే హేలన

 కృత్రిమ దీక్షలతో తెలుగు తమ్ముళ్లు
దూసుకుపోతున్నారు. నాలుగేళ్లు భారీగా పెరిగినా కాయాన్ని తగ్గించుకోవడానికి
(మురళీమోహన్‌ చెప్పినట్టుగా) రాష్ట్ర వ్యాప్తంగా దీక్షల బాట పట్టారు.  అధికారంలోకి వచ్చింది మొదలు ఈ నాలుగేళ్లు ప్రజా ధనాన్ని తిని
అడ్డదిడ్డంగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి దీక్షా మార్గాన్ని ఎంచుకున్నారు.
తిండి తగ్గించో.. పస్తులుండటం ద్వారా కాలయాపన అవుతుందని భావించి దీక్షా దక్షులుగా
కలరింగ్‌ ఇచ్చేందుకు కొత్త దారి కనిపెట్టారు. ఎలాగూ ఎన్నికలొస్తున్నాయి గనుక పబ్లిసిటీతోపాటు
సింపతీ సంపాదించడమే ధ్యేయంగా ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్యపై దొంగ దీక్షలకు శ్రీకారం
చుట్టారు. గతంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుంటే అన్ని చేసేశాం అని చెప్పిన చంద్రబాబు
అండ్‌ కో.. ఇప్పుడు అవే హామీలు నెరవేర్చాలని కేంద్రానికి వ్యతిరేకంగా దీక్షలు
చేయడం జనాన్ని నివ్వెర పరుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సహా టీడీపీ
నాయకులు ఎన్ని డ్రామాలు ఆడారో తెలుగు ప్రజలందరికీ చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే
ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గత కొన్ని రోజులుగా హడావుడి ప్రారంభించేశాడు. హోదా
కోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు వెళ్లి తన స్వకార్యాలు చక్కబెట్టుకొచ్చాడు. ప్రత్యేక
హోదాపై నేషనల్‌ మీడియాకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తానని చెప్పి
అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై అమర్‌సింగ్‌తో కలిసి ఓ కార్పొరేట్‌ కంపెనీ యజమానితో కలిసి
మంత్రాంగం నడిపారనే వార్తులు గుప్పుమన్నాయి, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్
చేస్తే దున్నపోతు మీద వాన పడిన చందంగా ఏ మాత్రం స్పందించలేదు. ఆ తర్వాత ఒక ప్రెస్‌
మీట్, ఆంధ్రాలో ఒక బహిరంగ సభ నిర్వహించి పోరాటానికి అలా ముగింపు
పలికేశాడు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తుంటే టీడీపీ
ఎంపీలు మాత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా
గడిపారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఉక్కు దీక్ష పేరుతో సీఎం రమేశ్, బీటెక్‌ రవి వంటి
వారు చేసిన హడావుడి వారిని నవ్వుల పాలు చేసింది. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన సీఎం
రమేశ్‌ ఒక్క గ్రాము కూడా బరువు తగ్గకపోవడం చూసి తెలుగు సమాజం నివ్వెరపోయింది.
దీక్షలో ఉన్న సీఎం రమేశ్‌ను పలకరించడానికి వచ్చిన పెద్దలను చూసి జనాలు
నోరెళ్లబెట్టారు. డ్రామాను రక్తి కట్టించడానికి లగడపాటి, మాజీ సీబీఐ జేడీ
లక్ష్మీనారాయణ వంటి వారిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. దాంతోపాటు సీఎం
రమేశ్‌ నిరాహార దీక్షపై సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన విమర్శలు.. ఆ
తర్వాతే ఎంపీలతా నిరాహార దీక్షలను విమర్శిస్తూ హేళనగా మాట్లాడటం చూసి ప్రజా
సమస్యలపై టీడీపీ నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదీ చూసి జనం అర్థం చేసుకున్నారు.
తాజాగా రైల్వే జోన్‌ సాధనకోసమంటూ ఆ పార్టీ ఎంపీలు విశాఖలో ఒకరోజు దీక్షకు
కూర్చున్నారు. విశాఖ ప్రాంతం నుంచి ఎన్నికైన బిజెపి ప్రతినిధుల సైతం ఇప్పుడూ
అప్పుడూ అంటూ జోన్ పై ప్రకటన చేయడం తప్పితే సీరియస్ గా ప్రయత్నించిన దాఖలాలు లేవనే
విమర్శలు ఉన్నాయి.

 గతంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌
కోసం విశాఖ వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పాదయాత్ర చేశారు.
దాంతోపాటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ సైతం
కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాశారు. రాష్ట్ర వ్యాప్తం బంద్‌ నిర్వహించారు.  విశాఖ కేంద్రంగా విశాఖ, గుంతకల్, గుంటూరులతో కూడిన
రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు విద్యా సంస్థలు, రైల్వే జోన్‌తోపాటు పలు రాయితీలను
ఇవ్వాలని నిర్ణయించారన్నారు. పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో విశాఖకు ప్రత్యేక
రైల్వే జోన్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా దాని ఊసే
ఎత్తడంలేదన్నారు. జోన్‌ను సాధించడం కోసం ప్రజలను సిద్ధం చేయడానికి అనకాపల్లి నుంచి
భీమిలి వరకు అన్ని నియోజకవర్గాలను కవర్‌ చేసే విధంగా ఈ పాదయాత్ర చేశారు. అలాగే గతంలో అనేక సందర్భాల్లో పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని సభలో
లేవనెత్తారు. నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్
పార్టీని తూలనాడిన టిడిపి నేతలు, ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి, రానున్న
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న మోసకారి దీక్షలకు తగిన గుణపాఠం చెప్పే
రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 

Back to Top