అర్ధరాత్రి దాటినా కొనసాగిన జగన్‌ పర్యటన

హైదరాబాద్ :

అర్ధరాత్రి అయింది. అయినా హెలెన్‌ తుపాను బాధితులను పరామర్శించడంలోనే నిమగ్నమయ్యారు వైయస్‌‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి. కష్టాల్లో ఉన్న అన్నదాతలను కలుసుకుని సానుభూతి ప్రకటించడానికి, అండగా నేనున్నానంటూ వారికి భరోసా ఇవ్వడానికి, ఆత్మీయంగా ఓదార్చడానికి సమయంతో నిమిత్తం లేదని ఆయన నిరూపించారు. తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్‌ తుపాను బాధిత కోనసీమలో ఆయన పర్యటన మంగళవానం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. ‘నాలుగు నెలల్లో రాష్ట్రంలో మన ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వం ఇలా ఉండదు. రైతులకు రుణమాఫీ చేస్తుంది. బాధితులను తక్షణం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’ అని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ముందుగా శ్రీ జగన్ అంబాజీపేట మండలం మాచవరంలో అరటి తోటను, తరువాత రాజోలు మండలం శివకోడులో తుపాను బాధిత రైతులను పరామర్శించారు. శివకోడులో నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్ బొంతు రాజేశ్వరరావు తుపాను నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ‌ప్రదర్శనను శ్రీ జగన్మోహన్‌రెడ్డి పరిశీలించారు. రైతుల నుంచి పంట నష్టం వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ‘రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే త్వరలో రాబోయే మన ప్రభుత్వం చేస్తుంది. అధైర్యపడవద్దు’ అని అని భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు కూడా అన్ని విధాలా సహాయం అందిస్తానన్నారు.

అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో శ్రీ జగన్ శివకోడు వచ్చినా ఆయన రాక కోసం‌ వేలాది మంది ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒంటి గంటకు దిండి చించినాడ వంతెన మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు శ్రీ జగన్ వెళ్లారు.

‌అంతకు ముందు మాచవరంలో ధ్వంసమైన అరటి తోటను శ్రీ జగన్ పరిశీలించారు. కౌలు రైతు మంచాల సూరిబాబును పరామర్శించారు. ఎన్ని ఎకరాలు కౌలు తీసుకొని అరటి సాగు చేస్తున్నావని, అయిన  ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ‘ఐదెకరాలలో ‌తాను అరటి సాగుచేశానని, తుపానుకు మొత్తం ధ్వంసమైందని, అరటి తోటను బాగుచేసుకొనేందుకే రూ.20 వేలు ఖర్చువుతుందని సూరిబాబు చెప్పాడు. మరో రైతు దొమ్మేటి వెంకటేశ్వరరావును శ్రీ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ‘తుపానుకు కొబ్బరి చెట్లు విరిగిపోయాయి.. కొబ్బరి దిగుబడులు వచ్చేసరికి మూడేళ్లు పడుతుంద’ని చెప్పారు. 15 నిమిషాల పాటు శ్రీ జగన్ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గంగలకుర్రు మలుపు వద్ద యూత్ నాయకుడు విత్తనాల శేఖ‌ర్ ఆధ్వర్యంలో‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ కన్వీన‌ర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, మిండగుదిటి మోహన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుచ్చర్లపాటి సూర్యనారాయణరాజు, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు జక్కంపూడి తాతాజీ, మండల కన్వీనర్లు యెనుముల నారాయణస్వామి, జిల్లెళ్ల బెన్నీ, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగిరాజు సాయిరాజు, వాసంశెట్టి చిన సత్యనారాయణ, గెడ్డం ‌ఫిలిప్‌రాజు, అల్లూరు రంగరాజు, పోతురాజు కృష్ణ, యూత్ కమిటీ సభ్యులు తెన్నేటి కిషోర్, గుండిమేను శ్రీనివా‌స్ యాదవ్, కుంపట్ల బాబి తదితరులు పాల్గొన్నారు.

Back to Top