హైదరాబాద్ : సింగపూర్ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని చూడటానికి రెండు కళ్లూ చాలటం లేదు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అండ్ కో చూపిస్తున్న గ్రాఫిక్ మాయాజాలం హాలీవుడ్ సినిమాల్ని తల దన్నేదిలా ఉంది. మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి సింగపూర్ సంస్థ లకు అసలు కాంట్రాక్టులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అడుగడుగునా అనేక అనుమానాలకు తావిచ్చేదిగా ఇది సాగుతోంది.1. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా లేక సింగపూర్ దా..!2. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారంటూ ప్రచారం ఎందుకు..!3. అందమైన కట్టడాలన్నీ ఒక్క చోట ఏ విధంగా సాధ్యం అవుతాయి..!4. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు ఎలా పరుగులు పెడుతున్నారు..!5. ఉన్నదంతా ఊడ్చి అక్కడే పెడితే ఇతర ప్రాంతాల అభివృద్ది మాటేమిటి..!6. ఆరోపణల్ని పక్క దారి పట్టించేందుకు జరుగుతున్న డైవర్షన్ ప్లాన్ అనుకోవచ్చు గా..|7. రైతులు, వ్యవసాయ కూలీల సంగతి ఏమిటి..!8. గ్రామాల్ని తాక బోమంటూ కబుర్లు చెప్పారు. మరి, ఐదు గ్రామాల ఉనికి కోల్పోతున్నాయి కదా..!9. భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్ సంగతేమిటి..!10. స్విస్ చాలెంజ్ పద్దతిని ఎందుకు కోరుకొంటున్నారు..!11. సింగపూర్ కు భారీ నిర్మాణాల రంగంలో అనుభవం లేదని తెలిసినా ఎందుకు ఆరాట పడుతున్నారు..!12. 2050 వరకు నిర్మాణాలు జరుగుతూనే ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి..!