‬పట్టిసీమ అవినీతి బాగోతం బట్టబయలు

హంద్రీనీవా పంపులు పట్టిసీమకి..!
ప్రచార ఆర్భాటం కోసం హడావుడి..!
నాణ్యత లోపంతో కుడికాల్వకు గండి..!
మూతబడిన పట్టిసీమ పంపు...!

కర్నూలుః పట్టిసీమ పేరుతో ప్రభుత్వం ఆడుతున్న బాగోతం మరోసారి బట్టబయలైంది. పంపులు బిగించకుండానే పట్టిసీమను జాతికి అంకితం చేశామని చెప్పుకున్న చంద్రబాబు...మరో నయవంచనకు పాల్పడ్డారు. గుట్టుచప్పుడా కాకుండా హంద్రీనీవా పంపులను ఎత్తుకొచ్చి పట్టిసీమలో బిగించి నీళ్లు ఇస్తున్నట్లు నటించారు. తీరా 24 గంటలు గడవకుముందే దాన్ని ముసేశారు. హంద్రీనీవా లిఫ్ట్ పాత మోటార్ ను తీసుకొచ్చి పట్టిసీమ మొదటి పంపుకు బిగించిన మొదటిరోజే అది మొరాయించింది. కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలోనూ అనుమానాలు రేకెత్తాయి. పైగా మోటార్ బోపాల్ నుంచి తెచ్చినట్లు నమ్మించారు. తీరా హంద్రీనీవాలో మోటార్ మిస్సవ్వడంతో గుట్టు రట్టయ్యింది. మరమ్మతులు చేసి ఆన్ చేసిన ఒక్కరోజుకే మూసేసిన దుస్థితి.  

ఆది నుంచి మోసమే..!
ఆది నుంచి పట్టిసీమ విషయంలో ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదు. ప్రభుత్వ డొల్లతనాన్ని పలుమార్లు వైఎస్సార్సీపీ బయటపెట్టింది. ఐనా ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి జాతీయ పోదా ఉన్న పోలవరంను కాదని పట్టిసీమను తెరుపైకి తెచ్చింది. టెండర్లు మొదులుకొని డిజైన్ వరకు అంతా దోపిడీనే. ఈనెల 16న ఆఘమేగాల మీద మోటార్ పట్టుకొచ్చారు. పంపు అలైన్ మెంట్ సరిగా కుదరకపోవడంతో కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేశారు. మోటార్ బిగించకుండానే, నీళ్లు లేకుండానే నధుల అనుసంధానం చేశామని సీఎం ప్రకటించేశారు. 17న మోటారు బిగించి18న ఆన్ చేశారు. 19న కుడికాల్వకు గండిపడడంతో మూసేశారు.

అవినీతి ముసుగు జారే..!
ఒక్కమోటారు ఆన్ చేస్తేనే కాల్వ తెగిపోయింది. మరి అన్ని మోటార్లు ఆన్ చేస్తే పరిస్థితేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హడావుడిగా నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఇంజినీర్లు వాపోతున్నారు.  అవినీతి మానసపుత్రిక మసుగు జారడంతో కృష్ణాకు వెళ్లాల్సిన వాటర్ తమ్మిలేరు,కొల్లేరు బాటపట్టాయి. 
Back to Top