లోకేష్ శాఖలో చీకటి జీవోలు

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నది సామెత. పరిపాలనలో చీకటి కోణాలున్న చంద్రబాబుకు చంద్రుడిలాంటి కొడుకు ఉంటాడా? రహస్య జీవోలు జారీ చేయడంలో చంద్రాబాబుకు సాటీ, పోటీ ఎవ్వరూ ఉండరు. వందల కొద్దీ రహస్య జీవోలు అర్థరాత్రి జారీ చేయడం బాబు అలవాటు. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు దేశాన్ని నాశనం చేసే జీవోలు ఏవి తెచ్చినా అర్థరాత్రి నుంచే అమలు పరిచేవాళ్లట. అలాగే బాబు కూడా తాను చేసే నికష్టపు పనులకు రహస్యం అనే ముసుగు వేస్తుంటాడు. ఇప్పుడదే పద్ధతిని కొడుకు లోకేష్ యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోతున్నాడు. 

ఒకే రోజు 36 జీవోలు జారీ చేస్తే అందులో 33 జీవోలు రహస్యమట. పంచాయితీరాజ్ శాఖలో కూడా రహస్యంగా ఉండాల్సిన జీవోలు ఏమయ్యి ఉంటాయనేది మహా మహా సీనియర్ అధికారులకే అంతుపట్టకుండా ఉంది. ఒక పక్క తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఖర్చు పెడుతున్న టిడిపి ఆర్థిక బలం, మరో పక్క ఎపిలో త్వరలో రానున్న ఎన్నికల సమరం నేపథ్యంలో ఇన్ని రహస్య జీవోలు ఒకే రోజు ఎందుకు జారీ చేసారో అని ప్రజలు అనుమాన పడుతున్నారు. విదేశీ వ్యవహారాలు, ముఖ్యమంత్రి ఖర్చులు, కీలకమైన ఆర్థిక, హోం శాఖకు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారంటే అర్థం ఉంటుంది. కానీ పంచాయితీ శాఖలో కూడా రహస్య జీవోలు జారీ చేయొచ్చనీ, అదీ ఒకే రోజు పదుల సంఖ్యలో చేయడం వెనుక మతలబు ఏమై ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. 

ప్రజల సొమ్ముతో పరమ విలాసంగా ప్రవర్తించే చంద్రబాబు గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారీ గా నిధులును తీసుకుని ప్రచారం కోసం వినియోగించనున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే చంద్రబాబు అభివృద్ధి పనులను గోడలమీద రాయండని చెప్పడం, అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలను ఇంటింటికీ తిరిగి పసిపిల్లలతో సహా అందరికీ తన గురించి చెప్పమని ఆదేశించడం చూస్తే గ్రామస్థాయిలో ప్రచారం కోసం పెద్ద ఎత్తున పంచాయితీ నిధులును ఖర్చు చేసేందుకే ఈ రహస్య జీవోలని చాలామంద భావిస్తున్నారు. 


 
Back to Top